బహిరంగంగా.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే..
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్
Warangal : బహిరంగంగా తల్వార్(కత్తి)ను తిప్పుతూ ప్రదర్శనలు ఇచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల కాలం లో వరంగల్ కమిషనరేట్ పరిధి (warangal police commissionerate) లో తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. కొందరు వ్యక్తులు తల్వార్లు, కత్తులతో యథేచ్ఛగా తిరుగుతూ ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై ఎవరైనా వ్యక్తులు పుట్టిన రోజుల వేడుకల్లో గానీ ఇతర కార్యక్రమాల సమయాల్లో గానీ తల్వార్లను బహిరంగంగా ఎత్తిచూపడం, వాటిని తిప్పతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్లు లేదా కత్తులతో కేకులను కట్ చేస్తున్నట్లుగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా పోస్టులు చేయొద్దని హెచ్చరించారు. అలాగే తల్వార్లు పట...