Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: waranagal

పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు
Crime, Local

పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

Warangal : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇళ్లో  చోరీలకు పాల్పడుతున్న దొంగను సీీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దొంగ నుంచి పోలీసులు రూ.10లక్షల 9 వేల విలువ గల 163 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడిండిచారు. సూర్యపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిది ఆంజనేయులు అలియాస్ అంజి చదువుకునే రోజుల్లోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కగా జువైనల్ హోంకు తరలించారు. కొద్ది రోజుల అనంతరం నిందితుడు మరో మారు మిర్యాలగూడ, ఖమ్మం, హుజూర్ నగర్, గద్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితుడు ఆంజనేయులును పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిలో జైలు విడుదలయిన తర...