YS Jagan | వక్ఫ్ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
YS Jagan Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు (Waqf Act) ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో జగన్ సమావేశమయ్యారు. .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారంపై వైసీపీ నిరంతరం దృష్టిసారించిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశామని, ముస్లిం మైనారిటీలకు మా పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని చెప్పారు. ఇక వక్ఫ్ బిల్లుపై ముస్లింలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడుతారని చెప్పారు. పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చొరవ తీసుకుని, అన్ని అభ్యంతరాలను పార్లమెంటు ద...