Waqf Bill | వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 6 పిటిషన్లు.. ఎవరెవరు వేశారు?
Waqf Bill | న్యూఢిల్లీ: 2025 వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల జాబితాను పరిశీలించడానికి సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. జమియత్ ఉలేమా-ఎ-హింద్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విన్నది. ఈ పిటిషన్లు చాలా ముఖ్యమైనవని. వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రాధన్యతను బట్టి అన్నింటిని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.
బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025కు శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో, వక్ఫ్ చట్టం, 1995 పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ (UMEED) చట్టం, 1995గా కూడా మార్చారు.
ఇస్లామిక్ మత నాయకుల సంస్థ అయిన జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ దాఖలు చేసిన ప...