Tuesday, March 4Thank you for visiting

Tag: Waqf Act

ఆ గ్రామం మొత్తం మాదేన‌న్న సున్నీ వక్ఫ్ బోర్డు, ఆందోళ‌న‌కు దిగిన‌ గ్రామస్థులు

National
Patna | ఆ గ్రామం మొత్తం త‌మ‌దేన‌ని, నెల‌రోజుల్లో గ్రామ‌స్థులంద‌రూ ఖాళీ చేయాల‌ని బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు (Sunni Waqf Board) డిమాండ్ చేసింది. దీంతో ఒక్క‌సారిగా షాక్ కు గురైన ఆ గ్రామ ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఘట‌న బిహార్ రాజ‌ధాని పాట్నా జిల్లాలోని గోవింద్‌పూర్ లో జ‌రిగింది. గ్రామం మొత్తం తమదేనని పేర్కొంటూ, 30 రోజుల్లోగా భూమిని ఖాళీ చేయాలని కోరుతూ బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు నోటీసులు జారీ చేయడంతో వివాదం మొద‌లైంది. ఈ గొడవల నేప‌థ్యంలో ఫతుహా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి నేత సత్యేంద్ర సింగ్ నేతృత్వంలోని పార్టీ కార్య‌క‌ర్త‌లు గోవింద్ పూర్‌ గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. ఈ బృందం తన నివేదికను పాట్నా సాహిబ్ రవిశంకర్ ప్రసాద్‌కు సమర్పించనుంది. నిర్వాసితులకు న్యాయం చేస్తామని బృందం హామీ ఇచ్చింది. "ఎంపి రవిశంకర్ ప్రసాద్ ఆదేశాల మేరకు మేము బాధిత గ్రామాన్ని సందర్శించాము" అని...

YS Jagan | వక్ఫ్‌ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

Andhrapradesh
YS Jagan Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టిన వక్ఫ్‌ బిల్లు (Waqf Act) ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. .. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'ముస్లిం మైనారిటీల సమస్యల ప‌రిష్కారంపై వైసీపీ నిరంత‌రం దృష్టిసారించింద‌ని తెలిపారు. మైనార్టీల‌ సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశామ‌ని, ముస్లిం మైనారిటీలకు మా పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని చెప్పారు. ఇక‌ వక్ఫ్‌ బిల్లుపై ముస్లింలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను త‌మ‌ పార్టీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడుతార‌ని చెప్పారు. పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చొరవ తీసుకుని, అన్ని అభ్యంతరాలను పార్లమెంటు ద...

Waqf Board | వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయనున్న మోదీ సర్కార్? అసలేంటీ వివాదం..

Trending News
Waqf Board | ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేస్తూ త్వరలో బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, శుక్రవారం (ఆగస్టు 2) సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ఏ భూమినైనా క్లెయిమ్ చేసే అపరిమితమైన అధికారాల కారణంగా వక్ఫ్ బోర్డు వేల కోట్ల విలువైన 9.4 లక్షల ఎకరాలను తన గొడుగు కిందకు తెచ్చుకుంది. కాంగ్రెస్ హయాంలో UPA-2 వక్ఫ్ చట్టం ప్రకారం అదనపు అధికారాలను కట్టబెట్టింది. తద్వారా వక్ఫ్ బోర్డు నుంచి నుంచి భూమిని తిరిగి పొందడం ఎన్నటికీ అసాధ్యంగా మారింది.  ప్రభుత్వ భూములపై ​​క్లెయిమ్ చేసే కేసులు సం...
Exit mobile version