Mathura | మధుర, బృందావన్‌లోని ప్రసాదాలపై అలర్ట్.. నమూనాలను ల్యాబ్ కు తరలింపు
Mathura | తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం మధుర (Mathura Temple) , బృందావనం తదితర ప్రాంతాల్లోని ధార్మిక క్షేత్రాలకు సమీపంలోని 15 దుకాణాల నుంచి 43 ఆహార పదార్థాల నమూనాలను సేకరించింది. సేకరించిన ఆహార పదార్థాల్లో కల్తీ పదార్థాలను వాడుతున్నారనే అనుమానంతో లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి 'పేడా' (ఒక రకమైన స్వీట్) నమూనాను పరీక్షల నిమిత్తం పంపారు. ఎఫ్‌ఎస్‌డిఎ అసిస్టెంట్ కమిషనర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ సోమవారం మధుర, బృందావన్‌లలో నిర్వహించిన నమూనా ప్రచారంలో 15 మంది వ్యాపారుల నుంచి మొత్తం 43 నమూనాలను సేకరించినట్లు తెలిపారు. మిఠాయిలు, పాలు, పనీర్, పెడా, బర్ఫీ, మిల్క్ కేక్, రసగుల్లా, సోన్‌పాప్డి, ఇతర స్వీట్లు మసాలా దినుసులతో తయారుచేసిన వస్తువులను లాబ్ కు పంపించారు.
వాటిలో 42 స్టాండర్డ్‌లో ఉన్నట్లు గుర్తించామని, అయితే 'పెడా' నమ...