Lok Sabha Elections Phase 2 | రెండో దశలో పోలింగ్ జరిగే లోక్ సభ స్థానాల వివరాలు ఇవే.. బరిలో కీలక అభ్యర్థులు
Lok Sabha Elections Phase 2 | లోక్‌సభ మొదటి దశ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ కు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రెండో దశలో మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTలు) గల 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. కాగా ఏప్రిల్ 19న మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 109 స్థానాల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే..
లోక్‌సభ ఎన్నికల దశ 2లో భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (Congress)లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా 89 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి.
రెండో దశలో, 12 రాష్ట్రాలు, యూటీలో మొత్తం 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ (5), ఛత్తీస్‌గఢ్ (3), కర్ణాటక (14), మధ్యప్రదేశ్ ...