TRAI rules : వినియోగారులకు భారీ ఊరట.. కేవలం రూ.20తో మీ సిమ్ ను 90 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు
TRAI rules : భారతదేశంలోని చాలా మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో రెండు సిమ్ కార్డ్‌లను ఉంచుకుంటారు. సాధారణంగా, ఒక SIM సాధారణ కాలింగ్, డేటా కోసం ఉపయోగిస్తారు. మరొకటి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా పనిచేస్తుంది. సెకండరీ సిమ్ సాధారణంగా చాలా తక్కువగా వినియోగిస్తారు. అయితే సెకండరీ సిమ్‌ను డిస్‌కనెక్ట్ కాకుండా ఉండడానికి రీచార్జ్ చేస్తూ ఉంటారు. అయితే, గతేడాది జూలైలో పలు ప్రైవేట్ టెల్కోలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేసింది. దీంతో చాలా మంది తమ సెకండరీ సిమ్‌ను కొసాగించడం భారంగా మారింది.
అదృష్టవశాత్తూ ఈ సెకండరీ సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచేందుకు TRAI కొత్త నియమాలు సహకరిస్తాయి. TRAI కన్స్యూమర్ హ్యాండ్‌బుక్ ప్రకారం, SIM కార్డ్ 90 రోజులకు మించి ఉపయోగించకుంటే అది క్రియారహితంగా పరిగణించబడుతుంది.
TRAI new rules : ఒక SIM 90 రోజుల పాటు నిష్క్రియంగా ఉండి, ఇంకా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఉంటే, ...