Vishwakarma Yojana : విశ్వకర్మ యోజన కింద ప్రతిరోజూ రూ. 500 స్టైఫండ్, ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు..
PM Vishwakarma Yojana : దేశంలోని పేదల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. భారతదేశంలోని జనాభాలో ఎక్కువ భాగం చేతివృత్తుల వారు ఉన్నారు. ఇందులో కళాకారులు కూడా ఉన్నారు. చేతివృత్తుల వారికి ఉపాధి, సంక్షేమం కోసం భారత ప్రభుత్వం పిఎం విశ్వకర్మ పథకం అమలు చేస్తోంది.
2023 సంవత్సరంలో, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన (Vishwakarma Scheme)ను ప్రారంభించింది. దీని కింద నైపుణ్య శిక్షణతో పాటు హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను కూడా అందిస్తుంది. ఈ స్కీమ్‌లో ఎవరికి ప్రయోజనాలు లభిస్తాయి.. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శిక్షణలో ప్రతిరోజూ రూ.500
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమం కింద హస్తకళాకారులకు ప్రభుత్వం ద్వారా నైపుణ్య శి...