Friday, March 14Thank you for visiting

Tag: viral posts

Pre Wedding shoot in Hospital : ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి

Trending News
Pre Wedding shoot in Hospital | కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నిర్వ‌హించ‌డంపై పెద్ద దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రాంతంలోని జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడు డాక్టర్ అభిషేక్ తన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఏర్పాటు చేసుకున్నాడు. వీడియోలో డాక్టర్ అభిషేక్ ఒక రోగికి శస్త్రచికిత్స చేయడం కనిపిస్తుంది. పక్క‌నే ఉన్న అత‌డి భాగస్వామి అతనికి సహాయం చేస్తుంది. వీడియో ముగింపులో 'రోగి' ఆపరేషన్ తర్వాత కూర్చున్నట్లు చూపిస్తుంది. ప్రీ-వెడ్డింగ్ వీడియోను చిత్రీకరించేందుకు గాను ఆపరేషన్ థియేటర్‌లోకి కెమెరాలు, లైట్లు ఇత‌ర ప‌రిక‌రాల‌తో పాటు చాలా మంది వ్యక్తులను తీసుకొచ్చారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర వివాదం చెల‌రేగింది. విష‌యం తెలుసుకొన్న‌ కర్ణాటక ఆరోగ్య...

పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్‌ వాహనంతో పరార్‌

Trending News
చండీగఢ్‌: పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి ఏకంగా పోలీస్‌ వాహనంతోనే పరారయ్యాడు (man flees with police car) దీంతో పోలీసులు తమ వాహనం కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఒక చోట పోలీస్‌ వాహనం కనిపించింది. కానీ లాక్‌ చేసి ఉండటంతో కీ కోసం ఆ ప్రాంతంలో మళ్ళీ వెతికారు. హర్యానాలోని యమునా నగర్‌ జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఖుర్ది గ్రామంలో ఒక కుటుంబ కలహాలకు సంభందించిన వివాదంపై పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ ( ERV )లో పోలీసులు(Haryana Police) ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు ఘర్షణ పడటం వీరి కంట పడింది.. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ వాహనంలోనికి ఎక్కించారు. కాగా, పోలీసులు అనంతరం ఆ గ్రామానికి వెళ్లారు.. ఫోన్‌ చేసిన ఇంటికి వెళ్లి ఫిర్యాదుపై ఆరా తీయడంలో పోలీసులు నిమగ్నం అయ్యారు. ఇంతలో పోలీసు వాహనంలో ఉన్న...

ఓ వ్యక్తికి రెండేళ్లుగా కడుపునొప్పి, ఎక్స్ రే చూసి బిత్తరపోయిన డాక్టర్లు.. కడుపులో నుంచి ఏకంగా వంద వస్తువులు

Trending News
పంజాబ్ లో ఓ ఊహించని ఘటన జరిగింది. పంజాబ్‌లోని మోగాలోని ఓ ఆసుపత్రి వైద్యులు గురువారం ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా కడుపులో నుంచి వచ్చిన వస్తువులను చూసి షాక్ కు గురయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్‌లు, లాకెట్‌లు, స్క్రూ, రాఖీలను బయటకు తీశారు. . 40 ఏళ్ల వ్యక్తి రెండు రోజులుగా వికారం, వాంతులు, తీవ్ర జ్వరం కడుపు నొప్పి(Stomach Pain)తో బాధపడుతూ.. మోగాలోని మెడిసిటీ ఆసుపత్రిలో చేరాడు. అతని కడుపు నొప్పి తగ్గకపోవడంతో, అతని నొప్పికి కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యులు అతని కడుపుపై ​​ఎక్స్-రే స్కాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్స్ రే రిపోర్ట్ చూసిన వైద్యులు బిత్తరపోయారు. స్కాన్‌లో మనిషి కడుపులో అనేక లోహ వస్తువులు ఉన్నట్లు తేలింది. మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన శస్త్ర చికిత్స అనంతరం అతడి శరీరంలోని నుంచి సుమారు 100కు పైగా వస్తువులను వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. అతని కడుపులోంచి బయటకు తీసిన దాదాపు వ...
Exit mobile version