Vane Bharat Express | వందే భారత్ రైళ్ల వేగం తగ్గింది…!
Vane Bharat Express Speed | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. తక్కువ టైంలో సుదూర గమ్యస్థానాలకు వెళ్లడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఈ వందేభారత్ రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్నాళ్లుగా వందే భారత్ రైళ్ల వేగం క్రమంగా తగ్గిపోతున్నట్లు తెలిసింది. గత మూడేండ్లలో వందే భారత్ రైళ్ల స్పీడ్ గంటకు 84.48 కిలోమీటర్ల నుంచి 76.25 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కుచ ట్టం కింద దరఖాస్తు చేయగా రైల్వే అధికారులు సమాధానమిచ్చారు.
IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరల...