CM Revanth Reddy | సర్కారు బడులపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం..
CM Revanth Reddy | తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు తక్కువగా ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయొద్దని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామం, తండాలకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. శిథిలమైన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. విద్యార్థులు రావడం లేదనే సాకుతో సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని, మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే అలాంటి దుస్థితి వచ్చిందని తెలిపారు.
పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ (vandemataram foundation) ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సోమవారం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ...