Vande Cargo | వందే భారత్ తర్వాత వందే కార్గో వస్తుంది! ఈ రైలు ఫస్ట్ లుక్ చూడండి..
Vande Cargo News | భారతీయ రైల్వే వందే భారత్ రైలు ద్వారా ఎంతో మందికి సౌకర్యవంతమైన, విలాసవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించింది. వందే భారత్ రైళ్ల సక్సెస్ తో ఇప్పుడు వందే భారత్ స్లీపర్ వెర్షన్, వందే మెట్రో రైళ్లు కూడా వస్తున్నాయి. అయితే త్వరలో సరుకుల రవాణా కోసం వందే కార్గో కూడా త్వరలో పట్టాలపై పరుగులు పెట్టబోతోంది. ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రైలు అధిక వేగంతో నడుస్తుంది. దీని రూపురేఖలు వందే భారత్ రైలును పోలి ఉంటాయి. దాని గురించిన పూర్తి వివరాలు ఇవే..
ఈ వందే కార్గో రైలు చూడడానికి సరిగ్గా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మాదిరిగానే ఉంటుంది. ఈ వందే కార్గో రైలులో ప్రయాణికులకు సీట్లు ఉండవు. మీడియా నివేదికల ప్రకారం, వందే కార్గో రైలు ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తిగా సిద్ధమవుతుంది. రైల్వే తన సేవలను మరింత మెరుగ్గా, ఆధునికంగా మార్చడంపై దృష్టి సారిస్తోంది. ఈ వందే కార్గో రైలు ద్వారా...