Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Vande Bharat

Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?
Trending News

Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్‌ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా జనాదరణ పొందాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ డిమాండ్, వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి, కొత్త వందేభారత్ సేవలను, వాటి వేరియంట్‌ల ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా (Full list of Vande Bharat Express trains ) 20830 - విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 20833 - విశాఖపట్నం సికిం...
Special Stories

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా వెళుతుందో తెలుసా..

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలను విప్లవాత్మకంగా మార్చింది, వేగం, సౌకర్యం, భద్రతతో కూడిన ఈ ప్రీమియం రైళ్లు కొద్ది రోజుల్లోనే ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొన్నాయి. ప్రజలు ఆధునిక సౌకర్యాలు, సమయపాలన, వేగం పరంగా భారతీయ రైల్వేలో ఏ రైళ్లు ఉత్త‌మ‌మో దానికే మొగ్గుచూపుతుంటారు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways)  కూడా విభిన్న‌మైన‌ ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా స‌రికొత్త రైళ్ల‌ను త‌ర‌చూ ప్ర‌వేశ‌పెడుతోంది స్టేష‌న్ల‌లో కూడా మౌలిక వ‌స‌తులను క‌ల్పిస్తోంది .ఇది బహుశా భారతీయ రైళ్లకు స్వ‌ర్ణ యుగంగా చెప్ప‌వ‌చ్చు. ఆర్థిక వృద్ధికి, ప్రాంతీయ అభివృద్ధికి ప్రీమియం రైళ్ల‌ విస్తరణతో దేశమంతటా కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vandebhaarath Express) సిరీస్ రైళ్లు.. మిగ‌తా హైస్పీడ్‌ రైళ్ల సర్వీసుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ర...
Trending News

వందే భారత్ స్లీపర్ రైలు 2025లో వ‌స్తోంది.. కొత్త రైలు రూట్, టికెట్ ఛార్జీలు, కొత్త ఫీచర్లు ఇవే..

Indian Railways | రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త, దేశంలో సుదూర ప్రయాణాలు చేసేవారి కోసం భారతీయ రైల్వే కొత్త‌గా వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat sleeper train) ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ రైలు ద్వారా అధునాత‌న సౌకర్యాల‌తో రాత్రిపూట వేగంగా త‌మ గ‌మ్య స్థానాల‌ను చేరుకోవ‌చ్చు. వందేభార‌త్ రైలు జనవరి 2025 నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. BEML, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) వందే భారత్ స్లీప‌ర్‌ రైళ్లను తయారు చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు: మార్గాలు వందే భారత్ స్లీపర్ రైలు మొద‌ట‌ న్యూఢిల్లీ మ‌ధ్య‌ శ్రీనగర్ మార్గంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఇది దేశ రాజధాని ఢిల్లీని జమ్మూ, కాశ్మీర్‌కు అనుసంధానిస్తుంది. ఈ రైలు సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, దాదాపు 13 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. మ‌రికొద్దిరోజుల్లోనే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చ...
Trending News

Stone Pelting Incident | భారతీయ రైళ్లపై పెరుగుతున్న వ‌రుస‌ రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..

Stone Pelting Incident | దేశంలో కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా అల‌జ‌డులు సృష్టించేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఇందుకోసం భార‌తీయ రైల్వేల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో వందేభార‌త్ రైలుపై దుండగులు రాళ్ల‌దాడి చేశారు. అంబ్-అండౌరా స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘ‌ట‌న‌లో రైలులోని సుమారు నాలుగు కోచ్‌లు దెబ్బతిన్నాయి. గ‌త శనివారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో బసల్ గ్రామ సమీపంలో రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి రెండు కోచ్‌ల కిటికీ అద్దాలను పగులగొట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. రైలుకు జ‌రిగిన‌ నష్టంపై అంచనా వేస్తున్నట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేప‌ట్టిన‌ట్లు వారు తెలిపారు. ...
National

Vande Bharat | 20 కోచ్ ల‌తో తొలి వందేభార‌త్ రైలు,.. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప‌రుగులు..

Varanasi Vande Bharat Express : భారతదేశపు మొట్టమొదటి 20-కోచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. న్యూఢిల్లీని వారణాసితో కలిపే ఈ రైలును ఇటీవ‌లేప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపరేషన్‌తో, న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణీకులు ఇప్పుడు రెండు నగరాల మధ్య ఫాస్టెస్ట్ జ‌ర్నీని ఎంచుకోవచ్చు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన ఈ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 1,440 సీట్లను క‌లిగి ఉంటుంది. ఇది మునుపటి 16- లేదా 8-కోచ్ వెర్షన్‌లతో పోలిస్తే ఇందులో ఎక్కువ సీట్లు ఉంటాయి. రైలు 8 గంటల్లో 771 కి.మీ ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తర రైల్వే జోన్‌లో నడుస్తుంది 771 కి.మీ ప్రయాణాన్ని సుమారు 8 గంటల్లో కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు, న్యూ ఢిల్లీ-వారణాసి మార్గంలో రెండు 20 కోచ్‌ల వందే భారత్ ...
National

10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం

10 New Vande Bharat Express | భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు వేగంగా మారుతున్నాయి. ఆధునిక రైళ్లు ఇప్పుడు రైల్వేల ముఖ చిత్రాన్ని స‌మూలంగా మార్చేశాయి. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను మెరుగుప‌రిచేందుకు భారతీయ రైల్వే తన రైళ్లు, ట్రాక్‌లను ఆధునీకరించడంతోపాటు కవ‌చ్ వ్య‌వ‌స్థ‌ను కూడా అన్ని రూట్ల‌లో ఇన్ స్టాల్ చేస్తోంది. అయితే ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చేప్పింది. సెప్టెంబర్ 15న ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటన సందర్భంగా 10 వందే భారత్ రైళ్లను ప్రకటించే/ప్రారంభించ‌నున్నారు. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభంతో బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. 10 New Vande Bharat Express : కొత్త వందే భారత్ రైళ్లు టాటా నగర్ నుంచి పాట్నా, టాటానగర్ నుండి బ...
Special Stories

Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు

Vande Bharat sleeper | దేశంలో రాత్రిపూట సుదూర రైలు ప్రయాణం చేసేవారికి మరింత అత్యాధునిక సౌకర్యవంతమైన అనుభవం అందించేందుకు త్వ‌ర‌లో వందేభార‌త్ స్లీప‌ర్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్లు అందుబాటులో రానున్నాయి. ఇటీవ‌ల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న బెంగళూరులోని BEML ఫెసిలిటీలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే.. వందే భారత్ స్లీపర్ టికెట్ ధర రాజధాని ధరలతో సమానంగా ఉంటుందని ఈసంద‌ర్భంగా వైష్ణవ్ తెలిపారు. "వందే భారత్ స్లీపర్ టికెట్లు మధ్యతరగతి కుటుంబాలకు అనువుగా రాజధాని ఎక్స్ ప్రెస్ తోస‌మానంగా ఉంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒక ప్రీమియం, ఫుల్‌ ఎయిర్ కండిషన్డ్ రైలు సర్వీస్, ఇది న్యూదిల్లీని భారతదేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులతో కలుపుతుంది. వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత మూడు నెలల్లో ప్యాసింజర్ కార్యకలాపాలు ప్రారంభమవుత...
National

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

New Vande bharat Trains  | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న దిల్లీ నుంచి ఒకే సారి మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు మీరట్ నుంచి లక్నో, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ అలాగే బెంగుళూరు నుంచి మధురై రూట్లలో నడుస్తాయి. ఫ్లాగ్ ఆఫ్ చేయబోయే కొత్త రైళ్లు: మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు-మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో బికనీర్ నుంచి దిల్లీకి వందే భారత్ నవంబర్‌లో బికనీర్‌ నుంచి ఢిల్లీ మార్గంలో వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఉదయం బికనీర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వీలు క‌లుగుతుంది. అదే రాత్రి తిరిగి రావొచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అక్టోబర్ నాటికి షెడ్యూల్, స్టేషన్ స్టాపేజ్‌లు, సమయాలను ఖరారు చేయడంతో నవంబర్ నుంచి రైళ్లు క్రమం తప్పకుండా నడపాలని రైల్వే అధికారులు ...
National

vande bharat | ఆల్‌స్టోమ్ కంపెనీ రూ.30,000 కోట్ల వందే భారత్ రైళ్ల తయారీ టెండర్‌ రద్దు

Indian Railways | ఊహించ‌ని విధంగా భారతీయ రైల్వే తాజాగా వందేభార‌త్ (vande bharat ) రైల్ కోచ్ ల త‌యారీకి సంబంధించి ఆల్‌స్టోమ్ ఒప్పందాన్ని రద్దు చేసింది. భారతీయ రైల్వే 100 అల్యూమినియం-బాడీ వందే భారత్ రైళ్ల తయారీతోపాటు నిర్వహణ కోసం రూ. 30,000 కోట్ల టెండర్‌ను రద్దు చేసింది. ఈ టెండ‌ర్ ను ఫ్రెంచ్ రోలింగ్ స్టాక్ మేజర్ ఆల్‌స్టోమ్ (Alstom India)జూన్ 2023లో గెలుచుకుంది. సాంప్రదాయ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో పోలిస్తే తక్కువ బరువు ఎక్కువ దృఢ‌త్వం క‌లిగిన‌ అల్యూమినియం-బాడీడ్ రైలు సెట్‌లు త‌యారు చేయాల‌ని ఇండియ‌న్ రైల్వే నిర్ణ‌యించింది. భారతీయ రైల్వే తన రైళ్ల‌ వేగం, సామర్థ్యం, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ అధునాతన రైళ్లను అందుబాటులోకి తీసుకురావాల‌ని భావిస్తోంది. అయితే మొదటి అల్యూమినియం-బాడీ కలిగిన వందే భారత్ రైళ్లు స్లీపర్ కోచ్ లుగా ఉంటాయని, 2025 మొదటి త్రైమాసికం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తో...
Telangana

Vizag Vande Bharat Express | విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు..

Vizag Vande Bharat Express | హైదరాబాద్‌ : విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 10 నుంచి కొత్త షెడ్యూల్ అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం Vizag Vande Bharat Express రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్, రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తాయి. ఇప్ప‌టివ‌ర‌కు షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు సేవ‌లందించేవి. విశాఖపట్నం-సికింద్రాబద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్  రైలు మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది. ఈ రైలు ఏడు ఏ.సి చైర్ కార్ కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్ ఏ...
Exit mobile version