Saturday, March 1Thank you for visiting

Tag: Vande Bharat Express

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా వెళుతుందో తెలుసా..

Special Stories
Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలను విప్లవాత్మకంగా మార్చింది, వేగం, సౌకర్యం, భద్రతతో కూడిన ఈ ప్రీమియం రైళ్లు కొద్ది రోజుల్లోనే ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొన్నాయి. ప్రజలు ఆధునిక సౌకర్యాలు, సమయపాలన, వేగం పరంగా భారతీయ రైల్వేలో ఏ రైళ్లు ఉత్త‌మ‌మో దానికే మొగ్గుచూపుతుంటారు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways)  కూడా విభిన్న‌మైన‌ ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా స‌రికొత్త రైళ్ల‌ను త‌ర‌చూ ప్ర‌వేశ‌పెడుతోంది స్టేష‌న్ల‌లో కూడా మౌలిక వ‌స‌తులను క‌ల్పిస్తోంది .ఇది బహుశా భారతీయ రైళ్లకు స్వ‌ర్ణ యుగంగా చెప్ప‌వ‌చ్చు. ఆర్థిక వృద్ధికి, ప్రాంతీయ అభివృద్ధికి ప్రీమియం రైళ్ల‌ విస్తరణతో దేశమంతటా కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vandebhaarath Express) సిరీస్ రైళ్లు.. మిగ‌తా హైస్పీడ్‌ రైళ్ల సర్వీసుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ర...

పూణే, బరోడా, సికింద్రాబాద్‌లను కలుపుతూ 4 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు…, ఛార్జీలు…

National
Vande Bharat Express: ప్రయాణికులకు శుభవార్త.. భారతదేశపు  హైటెక్, సెమీ-హై-స్పీడ్ లగ్జరీ రైలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో నాలుగు మార్గాల్లో ప్రారంభం కానుంది.. ఒక మార్గం మహారాష్ట్ర నుండి దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకకు కలుపుతుంది, మరొక మార్గం మహారాష్ట్ర నుండి గుజరాత్ వరకు ప్రధాన నగరాలు, రైల్వే స్టేషన్లను కలుపుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 4 కొత్త రూట్లలో ప్రారంభం కానుంది పూణే సోలాపూర్ మీదుగా పూణే కొల్హాపూర్, హుబ్లీ, ముంబైలను కలుపుతూ మహారాష్ట్రలో ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు నాలుగు కొత్త రూట్లలో, రైళ్లను పూణే నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దిగువ మార్గాలను తనిఖీ చేయండి: పూణే నుండి వడోదర వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూణే నుండి షెగావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూణే నుండి బెల్గాం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూణే నుండి సికింద్రాబాద్ వందే భారత్ ఎ...

Vande Bharat | ఈ రెండు ప్రధాన నగరాల మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్

Trending News
Vande bharat Express | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భార‌తీయ రైల్వే అన్ని విధాలుగా చ‌ర్య‌లు చేప‌డుతోంది. ముఖ్యంగా ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌త్యేక రైళ్ల ను న‌డిపిస్తోంది. రైల్వేస్టేష‌న్ల‌ను ఆధునికీక‌రించ‌డంతోపాటు అత్యాధునిక సౌక‌ర్యాల‌తో వందేభార‌త్ రైళ్ల‌ను కూడా అన్ని మార్గాల్లో ప్ర‌వేశ‌పెడుతోంది. ఇప్పటి వరకు చైర్‌కార్‌తో నడిచే వందేభారత్‌ను త‌క్కువ దూరం గ‌ల మార్గాల్లో న‌డిపించేవారు. అయితే ఇప్పుడు స్లీపర్ వందేభారత్ కూడా వ‌చ్చేసింది. దీంతో సుదూర మార్గాల్లో కూడా నడిపించాల‌ని భావిస్తున్నారు. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్‌లో కాకుండా చైర్ కార్‌లో ఉన్నప్పటికీ, దీపావళి, ఛత్‌ల పండుగ‌ల‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని దిల్లీ – పాట్నాల మధ్య వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును నడిపించాల‌ని నిర్ణయించారు. పండుగల సందర్భంగా ప్ర‌యాణికుల‌ రద్దీకి అన...

Stone Pelting Incident | భారతీయ రైళ్లపై పెరుగుతున్న వ‌రుస‌ రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..

Trending News
Stone Pelting Incident | దేశంలో కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా అల‌జ‌డులు సృష్టించేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఇందుకోసం భార‌తీయ రైల్వేల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో వందేభార‌త్ రైలుపై దుండగులు రాళ్ల‌దాడి చేశారు. అంబ్-అండౌరా స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘ‌ట‌న‌లో రైలులోని సుమారు నాలుగు కోచ్‌లు దెబ్బతిన్నాయి. గ‌త శనివారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో బసల్ గ్రామ సమీపంలో రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి రెండు కోచ్‌ల కిటికీ అద్దాలను పగులగొట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. రైలుకు జ‌రిగిన‌ నష్టంపై అంచనా వేస్తున్నట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేప‌ట్టిన‌ట్లు వారు తెలిపారు. ...

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్

Crime
Stone-Pelting on Trains | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వార‌ణాసిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ( Vande Bharat Express )  రైలుపై రాళ్ల దాడి ఘటనలకు కారణమైన ముఠాతో సంబంధం ఉన్న మోస్ట్‌ వాంటెడ్ నిందితుడిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) విజయవంతంగా పట్టుకుంది. రైలు ప్రమాదాలకు కార‌కుల‌య్యేవారిని గుర్తించడానికి, నియంత్రించడానికి ATS విస్తృత ద‌ర్యాప్తు చేస్తోంది. ఇదులో భాగంగా నిందితుడు పవన్ కుమార్ సహాని అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. గతంలో వ్యాస్‌నగర్, కాశీ స్టేషన్ ప్రాంతాల్లో రాళ్లదాడి ఘటనలకు సంబంధించి రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ నంబర్ 324/2024కి సంబంధించి అరెస్టు చేశారు. విచారణలో, హుస్సేన్ అలియాస్ షాహిద్ అని పిలిచే మరొక నిందితుడి పేరును ప‌వ‌న్ కుమార్‌ సహాని బయటపెట్టాడు. ఈ క్లూ ఆధారంగా ATS నిఘా సమాచారాన్ని సేకరించి, చందౌలీలోని మొఘల్ సరాయ్‌లో అద్దెకు ఉంటున్న హుస్సేన్‌ను...

Vande Bharat | 20 కోచ్ ల‌తో తొలి వందేభార‌త్ రైలు,.. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప‌రుగులు..

National
Varanasi Vande Bharat Express : భారతదేశపు మొట్టమొదటి 20-కోచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. న్యూఢిల్లీని వారణాసితో కలిపే ఈ రైలును ఇటీవ‌లేప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపరేషన్‌తో, న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణీకులు ఇప్పుడు రెండు నగరాల మధ్య ఫాస్టెస్ట్ జ‌ర్నీని ఎంచుకోవచ్చు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన ఈ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 1,440 సీట్లను క‌లిగి ఉంటుంది. ఇది మునుపటి 16- లేదా 8-కోచ్ వెర్షన్‌లతో పోలిస్తే ఇందులో ఎక్కువ సీట్లు ఉంటాయి. రైలు 8 గంటల్లో 771 కి.మీ ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తర రైల్వే జోన్‌లో నడుస్తుంది 771 కి.మీ ప్రయాణాన్ని సుమారు 8 గంటల్లో కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు, న్యూ ఢిల్లీ-వారణాసి మార్గంలో రెండు 20 కోచ్‌ల వందే భారత్ ...

భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు వ‌చ్చేసింది.. దీని ప్రత్యేకతలు, టిక్కెట్ ఛార్జీలు, రూట్స్..

Trending News
Namo Bharat Rapid Rail | దేశంలోని ఆధునిక ఫీచర్లు, స‌మీప‌ న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణాల‌ను విప్ల‌వాత్మ‌కంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి 'వందే భారత్ మెట్రో' సేవలను సోమవారం (సెప్టెంబర్ 16) గుజరాత్‌లో ప్రారంభించారు. వందే భార‌త్ మెట్రో రైలు తొలి ప్రయాణం భుజ్ నుంచి అహ్మదాబాద్ మధ్య జరుగుతుంది. ఇది కేవలం 5 గంటల 45 నిమిషాల్లో 360 కి.మీ గ‌మ్యస్థానాన్ని చేరుకుంటుంది. . ఈ మెట్రో సర్వీసుకు సంబంధించిన రోజువారీ సర్వీస్ సెప్టెంబర్ 17న ప్రారంభమవుతుంది, పూర్తి ప్రయాణానికి టిక్కెట్ ధర రూ. 455 గా నిర్ణ‌యించారు. భారతీయ రైల్వే వందే భారత్ మెట్రో పేరును 'నమో భారత్ ర్యాపిడ్ రైల్' (Namo Bharat Rapid Rail) గా మార్చింది. వందే భారత్ మెట్రో సంప్రదాయ మెట్రోలకు ఎలా భిన్నంగా ఉంటుంది? ఢిల్లీ, ముంబైతో సహా దేశంలోని ఇతర ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇతర సాంప్రదాయ మెట్రోలకు రైళ్ల‌కు భిన్నంగా వందే మెట్రో ఉంటుంది....

India’s first Vande Bharat Metro: ఈ రెండు నగరాల మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సెప్టెంబర్ 16న ప్రారంభం.. షెడ్యూల్ ఇదే..

National
Indian Railways | భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలును సెప్టెంబరు 16, 2024న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ రైలు ప్రారంభానికి ముందు, భారతీయ రైల్వే మొదటి వందే మెట్రో రైలు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు న‌గ‌రాల‌ మధ్య తరచుగా ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు వందేభార‌త్ మెట్రో రైలు సేవ‌లందిస్తుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఇది మొదటి మెట్రో సర్వీస్. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో: మార్గం, షెడ్యూల్ India's first Vande Bharat Metro: route, schedule దేశంలోని మొట్టమొదటి వందే భారత్ మెట్రో భుజ్-అహ్మదాబాద్ మార్గంలో నడుస్తుంది. ఇది వారానికి 6 రోజులు నడుస్తుంది. రైలు భుజ్ నుంచి ఉదయం 5:5 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. వందే మెట్రో రైలు తిరిగి 17:30 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరి 23:10 గంటలకు భుజ్ చేరుకుంటుంది. గుజరాత్‌లోని భుజ్ - అహ్...

Indian Railways | విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు ఈ స్టేష‌న్ లో హాల్టింగ్‌

Andhrapradesh
Vande Bharat Express | ఏలూరు ప్రజలకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజులుగా ఏలూరు రైల్వేస్టేషన్ (Eluru Station)లో వందే భారత్ రైలును నిల‌పాల‌ని డిమాండ్ వ‌స్తోదంఇ. ఈ క్ర‌మంలోనే ఎంపీ పుట్టా మహేశ్ స్పందించి ఆగస్టు 25 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో నిలిపేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరు రైల్వేస్టేష‌న్‌ లో ఒక నిమిషం పాటు ఆగనుంది. విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్‌.. ఆగస్టు 25న మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు బయలుదేరి ఏలూరుకి 5 గంటల 54 నిమిషాలకు చేరుకోనుంది. ఏలూరు రైల్వేస్టేషన్ నుంచి 5 గంటల 55 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేష‌న్ కు చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్లే వందేభార‌త్‌ రైలు... విశాఖపట్నం నుంచి వచ్చే రైలు ఏలూరులో నిలుస్తాయి. ఏలూరులో హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పించినందు...

Vande Bharat Sleeper: కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఆగస్టు 15 నుండి ఈ మార్గాలలో నడుస్తుంది.. వివరాలు ఇవీ..

National
Vande Bharat Sleeper : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వందే భారత్ రైలు అభిమానులకు శుభవార్త.. వందే భారత్ రైళ్లు విజయవంతమైన తర్వాత, భార‌తీయ రైల్వే త్వరలో ప్ర‌యాణికుల‌కు వందే భారత్ స్లీపర్ వెర్ష‌న్ ను కానుకగా ఇవ్వబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అనేక రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆగస్టు 15 నుంచి వందే భారత్ కొత్త స్లీపర్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో నడపవచ్చో చూడండి.. వందే భారత్ ఏ మార్గాల్లో నడుస్తుంది? నివేదికల‌ ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్ల (Vande Bharat Sleeper) ను నడపాలని ప్రతిపాదించారు. కాచిగూడ-విశాఖపట్నం, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె వంటి రద్దీ అయిన‌ రూట్లలో కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రై...
Exit mobile version