ఏడు పదుల వయసులో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections ) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏడు పదుల వయసు దాటిన సీనియర్ రాజకీయ నేతలు సైతం ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దించాలని కొందరు సీనియర్లు భావించినా ఆయా పార్టీల అధిష్ఠాన వర్గాలు వారికే టికెట్లు ఖరారు చేయడంతో వారు పోటీలో నిలుచున్నారు. దశాబ్దాలుగా ఎన్నో ఉన్నత పదవులు నిర్వర్తించిన సీనియర్ నాయకులు ఈసారి ప్రత్యర్థులతో తలపడుతుండడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వీరిలో ముఖ్యంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన వనమా వెంకటేశ్వర రావు వయసు 79 ఏళ్లు.. తన రాజకీయ వారసుడైన వనమా రాఘవ.. ఓ మహిళను వేధించిన కేసులో జైలు కు వెళ్లడంతో ఇబ్బందులు వస్తాయని నాలుగో సారి వనమా వెంకటేశ్వరరావు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించ...