Israel-Iran Tension Row : కొత్త యుద్ధం ప్రారంభమైందా? ఇరాన్ ఇజ్రాయెల్‌పై 100కు పైగా క్షిపణుల దాడి?
Israel–Hezbollah Conflict : ఇరాన్ నుంచి మంగళవారం (అక్టోబర్ 1, 2024) రాత్రి ఇజ్రాయెల్ వైపు 100 కంటే ఎక్కువ క్షిపణులతో దాడికి తెగబడింది. ఇరాన్ ఇజ్రాయెల్ వైపు 100 బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించింది, అయితే అంతకుముందు ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ప్రధాన నగరం టెల్ అవీవ్‌లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు గాయపడ్డారని, వారిలో నలుగురికి తీవ్రంగా గాయాలయినట్లు వార్తలు వెలువడుతున్నాయి..
మంగళవారం సాయంత్రం అమెరికా దీని గురించి ముందుగానే హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా అధికారులు అలెర్ట్ చేశారు. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు అమెరికాకు సంకేతాలు అందాయని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు 'AFP'కి తెలిపారు. ఈ దాడి నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడానికి మ...