Apple iPhone | ఇక పాస్‌వర్డ్ అవసరం లేదు.. మీ గుండెచప్పుడుతోనే మీ స్మార్ట్ ఫోన్ అన్ లాక్
Unlocking with Heartbeats | మీరు మీ ఫోన్‌ని అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్, పిన్, టచ్ ఐడి, ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి రకరకాల పద్ధతులను ఉపయోగించి ఉంటారు కదా.. అయితే వీటన్నింటికీ భిన్నంగా సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. Apple తన iPhone, Mac వంటి డివైజ్ ల కోసం కొత్త బయోమెట్రిక్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వీటిని అన్‌లాక్ చేయడానికి మీ హార్ట్ బీట్ ను ఉపయోగిస్తుంది. ఉపయోగిస్తుంది.
ECG ఆధారిత బయోమెట్రిక్ ఫీచర్
Apple iPhone, iPad, Mac తో సహా తన డివైజ్ ల కోసం ఇప్పుడు ECG (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) బయోమెట్రిక్ ఫీచర్‌పై పని చేస్తున్నట్లు నివేదించింది. ఈ ఫీచర్ మీ హృదయ స్పందనలకు సంబంధించి ప్రత్యేక లయపై ఆధారపడి ఉంటుంది. మీ గుండె లయ సరిపోలినప్పుడు మీ పరికరం అన్‌లాక్ చేస్తుంది.
హార్ట్ బీట్ తో అన్‌లాక్
ప్రతి వ్యక్తి హృదయ స్పందన కూడా వేలిముద్ర లేదా బయోమెట్రిక్ సెన్సార్ మాదిరిగ...