దేశంలో 20 నకిలీ యూనివర్శిటీలను ప్రకటించిన యూజీసీ
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) బుధవారం 20 విశ్వవిద్యాలయాలను "నకిలీ"వి అని ప్రకటించింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఫేక్ సంస్థలు ఉన్నాయని, వీటికి డిగ్రీని ప్రదానం చేసే అధికారం లేదని ప్రకటించింది.
ఈ విషయమై యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి మాట్లాడుతూ.. “యూజీసీ (University Grants Commission ) నిబంధనలకు విరుద్ధంగా అనేక సంస్థలు డిగ్రీలు అందిస్తున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చింది. అటువంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు ఉన్నత విద్య కోసం గానీ, ఉద్యోగాల్లో అవకాశాల కోసం గానీ చెల్లుబాటు కావు. ఈ యూనివర్సిటీలకు ఎలాంటి డిగ్రీని అందించే అధికారం లేదు’’ అని తెలిపారు.
ఢిల్లీలో ఎనిమిది "నకిలీ" విశ్వవిద్యాలయాలు ఉన్నాయి..
ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (All India Institute of Public and Physical Health Sciences);
కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యా...