రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు
న్యూఢిల్లీ: రోడ్డు మౌలిక సదుపాయాలను పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను (road accidents ) తగ్గించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్లపై "బ్లాక్ స్పాట్స్" తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు .
ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలు అమూల్యమైనవని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
"మన దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది 18-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారే ఉంటున్నారు.. ప్రమాదాల కారణంగా గాయపడినవారు వారి సంతోషకరమైన జీవితాన్ని కోల్పోతున్నారు." అని గడ్కరీ అన్నారు.
అధికారిక లెక్కల ప్రకారం.. 2021లో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.54...