HMPV : కలవరపెడుతున్న వైరస్.. భారత్‌లో 7 కేసులు
చైనా నుంచి విస్తరిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV)) మన భారతదేశంలోనూ కలవరపెడుతోంది. కేసులు క్రమేణా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి రెండు కేసులు నమోదు కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒకటి, చెన్నైలో రెండు కేసులు వెలుగు చూడగా తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్ (Nagpur)లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏడు, 14 ఏళ్ల చిన్నారులు ఈ HMPV బారినపడ్డారు.
జ్వరం, దగ్గుతో బాధపడుతుండటంతో..
HMPV Symptoms : జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఈ పిల్లలను రమదాస్‌పేట్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి జనవరి 3న తీసుకెళ్లారు. అనంతరం పరీక్షించిన వైద్యులు వీరు హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడ్డారని నిర్ధారించారు. కొవిడ్-19కి సారూప్యమైన ఈ వైరస్ పై, కింది శ్వాసకోశాలను ప్రభావితం చేస్తుంది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి దీని ప్రధాన లక్షణా...