Monday, March 3Thank you for visiting

Tag: Union Cabinet

Union Cabinet : అన్నదాతలకు కేంద్రం వరాలు..

National
Union Cabinet : కొత్త సంవత్సరం వేళ దేశంలోని రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ () నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కొత్త సంవత్సరంలో మొదటి రోజు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు అందించే సబ్సిడీని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350కే లభించనుంది. కాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. నాలుగు కోట్ల మందికి లబ్ధి దేశవ్యాప్తంగా రైతుల కోసం అమలుచేస్తున్న. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన (Pradhan Mantri Fasal Bima Yojana) పొడిగించాలని కేబినెట్ తీర్మానం చేసిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రూ. 69,515 కోట్లకు పెంచినట్లు తెలిపారు. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మ...

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ .. కొత్తగా కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

Andhrapradesh, National
Navodaya Vidyalaya | తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు( Kendriya Vidyalaya), నవోదయ విద్యాలయాలు(Navodaya Vidyalaya) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈమేర‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల మంజూరులో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించనుంది. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, కొత్తగూడెం, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డ...

Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Andhrapradesh
Amaravati Railway line : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలను కలుపుతూ మొత్తం రూ.6,798 కోట్లతో రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బీహార్‌లోని నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వే లైన్ డ‌బ్లింగ్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ సెక్షన్లలో 256 కి.మీ మేర డబ్లింగ్ తోపాటు అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త లైన్‌ను నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. కీలక ప్రాంతాల్లో కొత్తగా రైలు కనెక్టివిటీ ఈ రెండు ప్రాజెక్టులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలకు రైల్వే క‌నెక్టివిటీని అందిస్తాయి. ముఖ్యంగా నర్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వేలైన్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ రైల్వే లైన్ల‌ డ‌బ్లింగ్ పూర్తియితే నేపాల్, ఈశాన్య భారతదేశ సరిహద్దు ...

Agricultural Projects | రైతుల‌కు గుడ్ న్యూస్.. 13,966 కోట్ల విలువైన ఏడు వ్యవసాయ ప్రాజెక్టులకు ఆమోదం

National
Agricultural Projects | దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం రూ. 13,966 కోట్ల పెట్టుబడితో ఏడు కీల‌క‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు. వ్యవసాయ పరిశోధన, డిజిటల్ వ్యవసాయం, స్థిరమైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని వివరించారు. ఆహార, పోషకాహార భద్రత కోసం క్రాప్ సైన్స్: రూ. 3,979 కోట్లు ఆహారం, పోషకాహార భద్రత కోసం crop science కోసం ప్రభుత్వం రూ.3,979 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ఐదు రంగాలపై దృష్టి పెడుతుంది: పరిశోధన - విద్య: వ్యవసాయంలో విద్యా, పరిశోధన సామర్థ్యాలను పెంపొందించడం. మొక్కల జన్యు వనరుల నిర్వహణ: పంట అభివృద్ధి కోసం జన్యు వనరులను పరిరక్షించడం, ఉపయోగించడం. ఆహారం, పశుగ్రాసం పంటలకు జన్యుపరమైన మెరుగుదల: పప్పుధాన్యాలు, నూన...

Industrial Smart Cities | దేశ‌వ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు, 40 లక్షల ఉద్యోగాలకు అవకాశం

Business
Industrial Smart Cities  | దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 28,602 కోట్ల అంచనా వ్యయంతో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాల‌ని కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రూ. 1.52 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 9.39 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని, 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి ల‌భించే అవకాశం ఉంది. 12 ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీలు.. Industrial Smart Cities  : అమృత్‌సర్-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై, వైజాగ్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నాగ్‌పూర్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లతో సహా ఆరు పారిశ్రామిక కారిడార్లలో ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. . ఈ ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలు ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష...
Exit mobile version