ujjain incident : ఉజ్జయిని షాకింగ్ ఘటనలో ఆటోడ్రైవర్ తో సహా ముగ్గురి అరెస్టు..
ujjain incident : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉజ్జయిని నగరంలోని ఓ వీధిలో 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై రక్తమోడతూ అర్ధనగ్నంగా వీధుల్లో సాయంకోసం అర్థిస్తూ కనిపించిన హృదయవిదారక ఘటన అందరినీ కలిచివేసింది. అయితే అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఆటో డ్రైవర్‌ను మధ్యప్రదేశ్ పోటీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు . అరెస్టయిన ఆటో డ్రైవర్ రాకేష్ (38)గా గుర్తించారు.
ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కిందని, దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా లభించిందని తెలిపారు. అనంతరం ఆటోపై రక్తపు మరకలు ఉండడంతో ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన మరో ముగ్గురిలో ఒకరు ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు.పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడ...