Video: కదులుతున్న కారులో డ్రైవర్ వేధింపులు.. భయంతో వాహనం నుంచి దూకేసిన మహిళ
Uber driver harassing incident : రాజస్థాన్‌లో ఇటీవల ఉబర్ డ్రైవర్ వేధింపులకు గురైన ఓ మహిళకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో లైవ్ లోకి వచ్చింది. @littleshsssisters అనే యూజర్ నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, మనాలి గుప్తా తన కూతురిని స్కూల్ నుండి తీసుకువెళ్లడానికి వెళుతున్నప్పుడు ఆమెకు ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి వివరిస్తూ.. వీడియోను షేర్ చేసింది.
వీడియోలో, మనాలి తనతో ఏమి జరిగిందీ.. ఉబర్ డ్రైవర్ తనను ఎలా వేధించాడో వివరించింది
తన కూతురిని స్కూల్ నుంచి పికప్ చేసుకునేందుకు రైడ్ బుక్ చేశానని, తాను ఎవరితోనో కాల్ చేస్తున్నప్పుడు కారు డ్రైవర్ అకస్మాత్తుగా తన ఫోన్ లాక్కోవడానికి యత్నించాడని వివరించింది. ఆమె ఒక్కసారిగా భయపడిపోయి అతడిని వారించేందుకు ప్రయత్నించింది.. కానీ డ్రైవర్ దూషించడం మొదలుపెట్టాడు.
Uber driver harassing incident మనాలి కారును ఆపమని డ్రైవర్‌ని చాలాసార్లు చెప్పినా కూడ...