భార్యను రివాల్వర్ తో కాల్చిన భర్త.. అదే బుల్లెట్ తో అతడు మృతి
యూపీలో షాకింగ్ ఇన్సిడెంట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక్క బుల్లెట్‌తో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. నిజానికి ఓ వ్యక్తి మొదట తన భార్యను కౌగిలించుకుని, ఆ తర్వాత ఆమె వీపు వెనుక భాగంలో రివాల్వర్ తో కాల్చాడు. ఆ బుల్లెట్ తో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ వార్తపై చూసి అందరూ షాక్ కు గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనెక్ పాల్ (40), అతని 38 ఏళ్ల భార్య సుమన్ పాల్ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరూ చండీగఢ్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మొరాదాబాద్ కు వలస వచ్చాడు. జూన్ 13- 14 మధ్య రాత్రి బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని మొరాదాబాద్(moradabad) రూరల్ పోలీసు సూపరింటెండెంట్ సందీప్ కుమార్ తెలిపారు.
భార్యభర్తలిద్దరూ తరచూ గొడవపడేవారని దంపతుల బంధువులు, పిల్లలు ...