Free Bus Service | మహిళా ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక వారు టికెట్ కొనాల్సిందేనా.. ?
Telangana Free Bus Service : తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే డిమాండ్ కు తగినట్లుగా ఎక్స్‌ప్రెస్ బస్సులను టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) పెంచడం లేదు. దీంతో బస్ స్టాండ్లు, బస్ స్టాపుల్లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఒకవేళ బస్సులు వచ్చినా అవి పూర్తిగా జనంతో నిండిపోయి కనీసం నిలబడి ప్రయాణించే వీలు కూడా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలు గత్యంతరం లేక డబ్బులు చెల్లించి డీలక్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మహిళలను డీలక్స్ బస్సులవైపు వారిని మళ్లించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. మహిళలను డీలక్స్ బస్సులవైపు ఆకర్షించేందుకు తాజాగా డీలక్స్ బస్సు (Deluxe Bus ) ఎక్కితే వారికి బహుమతులు ఇస్తామంటూ కొ...