Tuesday, March 4Thank you for visiting

Tag: TSRTC MD Sajjanar

ప్ర‌యాణికుల‌కు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. హైద‌రాబాద్ శివార్ల‌లో..

Telangana
Special Buses for Dasara హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) 6,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు అక్టోబరు 1 నుంచి 15 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వాటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని తెలిపింది. న‌గ‌ర కీల‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక బ‌స్సులు పండుగల సమయంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది . MGBS , JBS, LB నగర్ , ఉప్పల్, ఆరామ్‌ఘర్, సంతోష్‌నగర్, KPHB, ఇతర ప్రాంతాల నుంచి వారి స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక బ‌స్సులు అందుబాటులో ఉంచబడతాయి . ఐటీ కారిడార్‌ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మీదుగా విజయవాడ , బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్స...

TGSRTC | ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం

Telangana
TGSRTC | కరీంనగర్‌: తెలంగాణ‌లోని నిరుద్యోగ యువ‌త‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో ఆర్టీసీ (TGSRTC) లో 3000 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈమేర‌కు ఆదివారం కరీంనగర్ (Karimnagar)  జిల్లా కేంద్రంలో నుంచి 33 ఎల‌క్ట్రిక్‌ బస్సులను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ (Ponnam Parbhakar)  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త‌మది ప్రజాపాలన అని, అన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద‌ ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్ల‌డించారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలను అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. కాగా విద్యుత్‌ బస్సుల (Electric Buses)  కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంద‌ని మంత్రి ...

Attack on RTC bus : ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి.. సీరియస్ అయిన ఎండీ సజ్జనార్..

Crime, Telangana
Attack on RTC bus | హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన TSRTC బస్సుపై గురువారం కొందరు దుండగులు ద్విచక్రవాహనాలపై  వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. అయితే ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దండగులు దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదనిఅన్నారు. ఆర్టీసీ బస్సుపై దాడిని తాము  తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పోలీసులు దర్యాప్తును ప్రారంభించినట్లు చెప్పారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ బస్...

TSRTC Buses : ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. విజ‌య‌వాడ‌కు ప్రతీ 10 నిమిషాల‌కు ఒక TSRTC బస్సు,

Andhrapradesh, Telangana
Hyderabad to Vijayawada Buses : వేస‌వి సెల‌వుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్‌ ఆర్టీసీ(TSRTC) బ‌స్సు స‌ర్వీసుల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) మార్గంలో ప్ర‌యాణించేవారి కోసం ప్రతీ 10 నిమిషాలకు ఒక‌ బస్సును న‌డిపించ‌నున్న‌ట్లు టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక‌ ప్రకటనలో తెలిపారు. ఈ రూట్ లో ప్రతిరోజు 120 కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయ‌ని స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. 10 శాతం డిస్కౌంట్ Hyderabad to Vijayawada Buses బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నామ‌ని సజ్జనార్ తెలిపారు. తిరుగు ప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని వివ‌రించారు. టీఎస్ఆ ర్టీసీ బస్సుల్లో అడ్...

Medaram Jatara | ఎలాంటి అద‌న‌పు వ‌సూళ్లు ఉండ‌వు.. మేడారం బస్సులపై ఎండీ సజ్జనార్

Telangana
Telangana : మేడారం సమక్క - సారక్క జాతర (Medaram Jatara) బుధవారం నుంచి అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. అయితే మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) సుమారు 6వేల వ‌ర‌కు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) మీడియా తో మాట్లాడుతూ.. మేడారం జాతరకు తెలంగాణ‌లోని అన్ని ముఖ్య న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందని తెలిపారు. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ఆయా జిల్లాల నుంచి పెద్ద సంఖ్య‌లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న క్ర‌మంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నట్లు వివ‌రించారు. మేడారం జాతర ( Medaram Jatara )క...

TSRTC Free Travel : మహిళా ప్రయాణికులకు అలర్ట్.. ఒరిజినల్ కార్డు తప్పనిసరి.. ఫోన్ లో చూపిస్తే చెల్లదు..

Telangana
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు (టీఎస్ఆర్టీసీ) కీలక సూచనలు చే సింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని(TSRTC Free Travel) వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గు ర్తింపు కార్డు తప్పనిసరి అని పేర్కొంది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ ఐడీ కార్డైన ఈ పథకానికి వర్తిస్తుందన్నారు.  అయితే పాన్‌ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.  ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని ఎన్నిసార్లు చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు స్మార్ట్‌ ఫోన్లు, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ కాపీలు చూపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని కారణంగా సిబ్బంది ఇబ్బందులు పడుతుండడంతోపాటు ప్రయాణ సమయం కూడా పెరుగు తున్నది.  దీం...
Exit mobile version