Triple Talaq | మోదీ, యోగిని ప్రశంసించిందుకు ముస్లిం మహిళకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
Triple Talaq |ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adithynath) ను పొగిడినందుకు ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చేప్పేశాడు. మోదీని ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేక ఆమె భర్త ఒక్కసారిగా ఆగ్రహించాడు. ఆపై వెంటనే ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పి (triple talaq) విడాకులు ఇచ్చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.
ఈ ఘనటకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా దిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో వివాహమైంది. పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తగారి ఇంటికి చేరుకున్న సదరు మహిళ అక్కడి రోడ్లు, నగర అభివృద్ధి, చూసి ఆశ్చర్యపోయింది. సంతోషంతో భర్త ముందు సీఎం యోగి, ప్రధాని మోదీన...