Friday, March 14Thank you for visiting

Tag: Trending

Mixing Urine with Juice | ఛీ.. చీ.. జూస్ లో మూత్రం క‌లిపిన వ్య‌క్తి.. చిత‌క‌బాదిన స్థానికులు

Viral
Ghaziabad : ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు యాజమాని జ్యూస్‌లో మూత్రం కలిపాడు. మూత్రం ఉన్న లీటర్‌ బాటిల్‌ ఆ షాపు వద్ద క‌నిపించింది. దీనిని చూసిన స్థానికులు స‌ద‌రు షాపు య‌జ‌మానిని నిలదీసి దాడిచేశారు. అనంత‌రం పోలీసులకు అప్ప‌గించి ఫిర్యాదు చేయ‌డంతో ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు యాజమానిని అరెస్ట్‌ చేశారు. షాపులోని యూరిన్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని అమీర్ ఖాన్‌, వివిధ‌ పండ్ల రసాల్లో మూత్రం కలిపి (Mixing Urine with Juice) విక్ర‌యిస్తున్నాడు. సెప్టెంబర్ 13న బాటిల్‌లో ఉన్న పసుపు రంగు ద్రవాన్ని ఫ్రూట్‌ జ్యూస్‌లో అతడు కలపడాన్ని కొందరు ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఆ బాటిల్‌ను పరిశీలించగా అది యూరిన్ అని స్ప‌ష్ట‌మైంది. దీంతో కంగుతిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న అమీర్ ఖాన...

Viral Video | క్రికెట్ మ్యాచ్‌పై సంస్కృతంలో కామెంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్..

Viral
Sanskrit commentary | క్రికెట్ అభిమానుల‌కు మ‌రింత జోష్ తెప్పించేందుకు కామెంట‌రీ చాలా కీల‌కం..ఒక‌ప్పుడు హిందీ, ఇంగ్లీష్ లో ఉన్న వ్యాఖ్యానాలు ఇప్పుడు అన్ని స్థానిక భాష‌ల్లో అందుబాటులోకి వ‌చ్చింది. అయితే మీరు ఎప్పుడైనా సంస్కృత వ్యాఖ్యానంతో క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడ‌డం మీరు ఊహించగలరా? ఇది భిన్నమైన అనుభవం కాదా? బెంగుళూరులో జ‌రిగిన ఒక‌ స్ట్రీట్ క్రికెట్ క్రికెట్ ఆటలో తన ఆలోచనను ఓ వ్య‌క్తి చేసిన కామెంట‌రీ అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది. సంస్కృతంలో తన అనర్గళంగా మాట్లాడే నైపుణ్యంతో ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు. ఆసక్తికరమైన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో క‌నిపించింది.  వైరల్ వీడియోలో ఏముంది? Sanskrit commentary | ఒక వ్యక్తి సంస్కృతంలో స్థానిక క్రికెట్ మ్యాచ్ లైవ్ కామెంట‌రీ చేయడం కనిపించింది.. టీవీలో క్రికెట్ వ్యాఖ్యాత చేసినట్లే, బ్యాటర్ బంతిని కొట్టినప్పుడు అతని స్వరం పెరిగింది. అతని ...

Video : ఇంధనం లేక రోడ్డుపై ఆగిన పోలీస్‌ వాహనం.. నిందితులతో నెట్టించిన పోలీసులు

Viral
పాట్నా: బీహాల్ (Bihar) లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసు వాహనంలో ఇంధనం లేక మార్గమధ్యలోనే ఆగిపోయింది. దీంతో కోర్టుకు తరలిస్తున్న నిందితులతో ఆ వాహనాన్ని కొంత దూరం వరకు తోయించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే నలుగురు నిందితులు మద్యం సేవిస్తూ పోలీసులకు చిక్కారు. దీంతో ఆ నలుగురిని పోలీస్‌ వాహనంలో కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇంతలో పోలీస్‌ వాహనంలో ఇంధనం అయిపోవడంతో కచాహరి చౌక్ సమీపంలో రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో అందులో కోర్టుకు తరలిస్తున్న నలుగురు నిందితుల చేతులను తాళ్లతో కట్టారు.. పోలీసు అధికారుల ఆదేశాల మేరకు నిందితులు పోలీసు వాహనాన్ని సుమారు అర కిలోమీటరు దూరం తోసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు కొందరు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేశారు. ఈ వీడియ...

ఒకేసారి ఎనిమిది దేశాల టైంను చూపించే వాచ్ ను తయారు చేసిన కూరగాయల వ్యాపారి

Trending News
Ayodhya : ఉత్తర ప్రదేశ్ లక్నోకు చెందిన ఒక కూరగాయల వ్యాపారి ఏకకాలంలో ఎనిమిది దేశాల్లో సమయాన్ని సూచించేలా అద్భుతమైన గడియారాన్ని రూపొందించారు. దీనిని అయోధ్య రామమందిరాని (Ayodhya Ram Temple) కి బహుమతిగా ఇచ్చాడు. 52 ఏళ్ల కూరగాయల వ్యాపారి అనిల్ కుమార్ సాహు ఇటీవల అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు ముందు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కు 75 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గడియారాన్ని బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ఈసందర్భంగా సాహూ మాట్లాడుతూ.."నేను అక్టోబర్ లో దేవీ నవరాత్రుల సమయంలో ఈ గడియారం (75 సెం.మీ.)పై పని చేయడం ప్రారంభించాను. ఇటీవల చంపత్ రాయ్ జీకి అలాంటి ఒక గడియారాన్ని బహుమతిగా ఇచ్చాను," అని తెలిపారు. గతంలో, అతను లక్నోలోని ఖతు శ్యామ్ దేవాలయం, కొత్వా ధామ్, బారాబంకిలోని కుంతేశ్వర్ మహాదేవ్ లకు కూడా అలాంటి గడియారాలను బహుమతిగా ఇచ్చారు. లక్నో హనీమాన్ క్రాసింగ్ సమ...

ఆస్పత్రి మార్చురీ ముందు ఏడాదిగా ఎదురుచూస్తున్న పెంపుడు కుక్క..! మనసును కదిలించే ఘటన..

Trending News
పెంపుడు జంతువులు వాటి యజమానుల మధ్య ఉండే అనుబంధాన్ని అనేక సందర్భాల్లో చూస్తుంటాం. అలాగే, సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతున్న వీడియోలను చూసినప్పుడు మన హృదయాలు ద్రవిస్తాయి. ఒక్కోసారి మనుషుల కంటే జంతువులకే విశాల హృదయం, దయ, ప్రేమ ఉంటుందనిపించే సన్నివేశాలు ఎన్నో మనకు ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. జంతు ప్రేమికుల బృందం సోషల్ మీడియా లో షేర్ చేసిన ఒక పోస్టు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒక పెంపుడు కుక్క (Pet Dog ) తన యజమాని కోసం చూస్తున్న ఎదురుచూపులు అందరినీ కదలించేలా చేసింది. ఆ వివరాలు ఇవీ.. ఫిలిప్పీన్స్‌లోని కాల్‌కూన్ నగరంలోని MCU హాస్పిటల్ మార్చురీ ఎదుట ఒక కుక్క రోజుల తరబడి పడిగాపులు కాస్తుంది. ఆహారం, నిద్ర లేకుండా ఆ కుక్క ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇదే ఆస్పత్రికి చేరుకుని మార్చురీ ముందే నిరీక్షిస్తుూ ఉంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది, అక్కడే చదువుతు...

పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్‌ వాహనంతో పరార్‌

Trending News
చండీగఢ్‌: పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి ఏకంగా పోలీస్‌ వాహనంతోనే పరారయ్యాడు (man flees with police car) దీంతో పోలీసులు తమ వాహనం కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఒక చోట పోలీస్‌ వాహనం కనిపించింది. కానీ లాక్‌ చేసి ఉండటంతో కీ కోసం ఆ ప్రాంతంలో మళ్ళీ వెతికారు. హర్యానాలోని యమునా నగర్‌ జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఖుర్ది గ్రామంలో ఒక కుటుంబ కలహాలకు సంభందించిన వివాదంపై పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ ( ERV )లో పోలీసులు(Haryana Police) ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు ఘర్షణ పడటం వీరి కంట పడింది.. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ వాహనంలోనికి ఎక్కించారు. కాగా, పోలీసులు అనంతరం ఆ గ్రామానికి వెళ్లారు.. ఫోన్‌ చేసిన ఇంటికి వెళ్లి ఫిర్యాదుపై ఆరా తీయడంలో పోలీసులు నిమగ్నం అయ్యారు. ఇంతలో పోలీసు వాహనంలో ఉన్న...

7 ఏళ్ల క్రితం గుడిలో చోరీ అయిన మీ బూట్లను గుర్తించడానికి స్టేషన్ కు రండి.. ఫిర్యాదుదారుడికి పోలీసుల ఫోన్

Trending News
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఏడేళ్ల క్రితం గుడి బయట చోరీకి గురయిన బూట్ల జతను గుర్తించడానికి పోలీసులు ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసి పిలిచారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన మహేంద్ర కుమార్ దూబే దాదాపు ఏడేళ్ల క్రితం రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలోని సన్వారియా సేఠ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో అతని బూట్లు చోరీకి గురయ్యాయి. దీంతో జనవరి 14, 2017న మన్సఫియా పోలీస్ స్టేషన్ లో అతను లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని అలాగే వదిలేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం, మహేంద్ర దూబేకి పోలీసు స్టేషన్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆలయంలో చోరీ అయిన కొన్ని జతల బూట్లు స్వాధీనం చేసుకున్నట్లు కానిస్టేబుల్ ఖుబ్‌చంద్ అతనికి కాల్ చేసి చెప్పాడు. వారిలో తన బూట్లను గుర్తించాలని కోరారు. ఈ కాల్ వెనుక కారణం ఏమిటంట...
Exit mobile version