Saturday, March 15Thank you for visiting

Tag: trending video

Viral Video : బైక్ రైడర్ హెల్మెట్ ధరించలేదు.. ఇక ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ లైట్ పడదు..

Trending News
అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అధిక జనాభా నగరాలు, పట్టణాల్లో వాహనదారులు తరచుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారు. వాహనాన్ని అతివేగంతో నడపడం,రాంగ్ రూట్లో దూసుకెళ్లడం, హెల్మెట్ ధరించకపోవడం వంటివి నిత్యం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి వారి వల్ల చాలాసార్లు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా ఫలితం ఉండడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బైక్ రైడర్ హెల్మెట్ ధరించినప్పుడు మాత్రమే ట్రాఫిక్ లో గ్రీన్ లైట్ వెలిగేలా ప్రత్యేకమైన హైటెక్ ట్రాఫిక్ లైట్లను తయారు చేశారు. తాజాగా ఈ ట్రాఫిక్ లైట్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చూడగానే ఈ వీడియో వాస్తవికంగా అనిపించకపోగా, గ్రాఫిక్స్ సహాయంతో రూపొందించినట్లు అనిపించినా, ఈ వీడియో ద్వారా చూపించిన సరికొత్త కాన్సెప్ట్ ప్రశంసించదగ్గదే.. ఇటీవల ట్విట్టర్ ఖాతా @TansuYegenలో ఒక వీడియో పోస్ట్ వై...
Exit mobile version