Tuesday, March 4Thank you for visiting

Tag: Trending Telangana

TG SSC Exams Fee 2025 : పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల – ముఖ్యమూన‌ తేదీలు..

Career
SSC Exams | తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు కీలక ప్ర‌క‌ట‌న వొచ్చేసింది. పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించుకునేందుకు ప్ర‌భుత్వం షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. ఎలాంటి రుసుం లేకుండా నవంబర్ 18 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఈ సంవ‌త్స‌రం ప‌దో త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థులతో పాటు బ్యాక్ లాగ్‌లు ఉన్న విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు చెల్లించుకోవచ్చు. గడువు దాటితే… రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. డిసెంబర్‌ 12 వరకు రూ. 200 ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకునే చాన్స్ ఉంటుంది. రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు పేపర్లలోపు బ్యాక్ లాగ్‌ ఉంటే రూ.110 చెల్లించాల...

Dasara Holidays 2024 | విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా.. ?

Telangana
Dasara Holidays 2024 | విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. ఈ సెప్టెంబరులో విద్యార్థులు చాలా రోజులు సెలవులు వచ్చాయి. మ‌రికొద్ది రోజుల్లో దసరా పండగ వ‌స్తోంది. దీంతో దసరా పండగ సెలవుల కోసం పిల్ల‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సెలవులు వ‌చ్చాయంటే చాలు హ్యాపీగా ఊళ్లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ విజ‌య‌ద‌శ‌మి పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబరు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవుల‌ను ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమ‌వుతాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతితో సెలవులు మొద‌ల‌వుతాయి.ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వెల్ల‌డించారు. మ‌రోవైపు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ తేదీ నుంచి స్కూళ్లు ప్రా...

Rythu Runa Mafi : రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసిన ప్రభుత్వం

Telangana
Rythu Runa Mafi | తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులను ప్ర‌భుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ ప్ర‌త్యేక‌ కార్యక్రమంలో మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు రూ. 7 వేల కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రైతులతో ఫోన్లో మాట్లాడారు ముందుగా ఒక రైతుతో మాట్లాడిన తర్వాత‌ బటన్ నొక్కి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులను విడుదల చేస్తామని సీఎం వెల్ల‌డించారు. రుణమాఫీ (Runa Mafi) నిధులు రైతుల ఖాతాల్లోకి బ‌దులుగా ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం ప‌టిష్ట‌మైన‌ చర్యలు చేపట్టినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో సోనియాగాంధీ ఇచ్చిన హామీని నెరవే...

Crop Loan | మూడు విడతలుగా రైతు రుణమాఫీ.. నేడే రైతుల ఖాతాల్లో నగదు..

Telangana
Crop Loan | హైదరాబాద్‌ ‌: కొన్ని నెల‌లుగా ఎదురుచూస్తున్ రుణ‌మాఫీ ప‌థ‌కం (Rythu Runa Mafi) ఎట్ట‌కేల‌కు ప‌ట్టాలెక్కింది. ఈ పథకంలో భాగంగా ఈరోజు గురువారం సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు న‌గ‌దు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చిన విష‌యం తెలిసిందే.. ‌దానిని అమలు చేసే దిశగా నేడు తొలి అడుగు వేయనుంది. ఈనెల 18న రూ.లక్షలోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆ మొత్తం జమ కానుంది. రేష‌న్ కార్డు లేని రైతుల‌కు.. అయితే రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉండగా..70 లక్షల మంది రైతులకు రుణాలు (crop loan waiver) ఉన్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్‌ ‌కార్డులు లేవు. ఈ విషయమై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో గ‌త మంగ‌ళ‌వారం కలెక్...

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎవరు? రూ.5 లక్షలు.. ఎలా మంజూరు చేస్తారు.. ?

Telangana
Indiramma Housing Scheme | నిరుపేదలు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే 'ఇందిరమ్మ ఇళ్ల' పథకానికి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. గతంలో ప్రజాపాలన (Praja Palana) లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ దశల వారీగా ఈ పథకం వర్తింపజేయనున్నారు. స్థలం ఉండి ఇల్లు లేనవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అయితే స్థలం కూడా లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి వివిధ రకాల ఇంటి మోడల్ డిజైన్లను ప్రభుత్వం రూపొందించింది. ఈ మోడల్ లో తప్పనిసరిగా ఒక వంట గది, టాయిలెట్‌ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ మోడల్ ను తీర్చిదిద్దారు. మొదటి విడతలతో అన్ని 90 వేలకు పైగా లబ్ధిదారులను గుర్తించ...

TSRTC Free Travel : మహిళా ప్రయాణికులకు అలర్ట్.. ఒరిజినల్ కార్డు తప్పనిసరి.. ఫోన్ లో చూపిస్తే చెల్లదు..

Telangana
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు (టీఎస్ఆర్టీసీ) కీలక సూచనలు చే సింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని(TSRTC Free Travel) వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గు ర్తింపు కార్డు తప్పనిసరి అని పేర్కొంది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ ఐడీ కార్డైన ఈ పథకానికి వర్తిస్తుందన్నారు.  అయితే పాన్‌ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.  ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని ఎన్నిసార్లు చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు స్మార్ట్‌ ఫోన్లు, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ కాపీలు చూపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని కారణంగా సిబ్బంది ఇబ్బందులు పడుతుండడంతోపాటు ప్రయాణ సమయం కూడా పెరుగు తున్నది.  దీం...

New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana
TS New Ration Cards : తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.. రేపటి నుంచి జనవరి 6 వరకు ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు.. దీనికి సంబంధించి సచివాలయంలో ‘ప్రజాపాలన’ లోగో, దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు బుధవారం ఆవిష్కరించారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏం చెప్పారు..? కొత్త రేషన్ కార్డుల మంజూరు (New Ration Cards)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్హులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న గ్రామసభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర దరఖాస్తుల ఫాంలను తీసుకు...

TS Mlas Assets: తెలంగాణలో 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు, కేసీఆర్ అప్పు రూ.8 కోట్లు.. ఎమ్మెల్యేల ఆస్తులు ఇవీ..

Trending News
TS Mlas Assets: తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలలో 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏడీఆర్) సంస్థ తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రూ.23 కోట్ల ఆస్తి ఉండగా, రూ.8 కోట్ల అప్పులు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. TS Mlas Assets : తెలంగాణలోని మొత్తం 119 శాసన సభ్యుల్లో 90 శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ADR) సంస్థ పేర్కొంది. బీఆర్ఎస్ (BRS) పార్టీలో ఉన్న 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది, ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఐదుగురు, అలాగే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు, ఇద్దరు బీజేపీ(BJP) ఎమ్మెల్యేల ఆస్తులు అలాగే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తులను ఏడీఆర్ (ADR) సంస్థ ప్రకటించింది. కాగా ఈ రిపోర్ట్ ను బట్టి తెలంగాణ సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.13.57 కోట్లుగా ఉంది. ఇక పార్టీలపరంగా చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి సు...

మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

Telangana
Musi River Bridges : హైదరాబాద్ మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ‌తుల్ల‌గూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో సహా ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి గొప్ప పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిన న‌దిగా మూసీ న‌ది ఉండేద‌ని గుర్తుచేశారు. గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మూసీ న‌ది మురికికూపంగా మారిం ది. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయని.. అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిల‌కు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని తెలిపారు. నిధులు పెరిగినా ప‌ర‌వాలేదు... హ...

ప్రభుత్వ సమాచారం ఇక నేరుగా మీ వాట్సాప్‍కే.. ఇలా ఫాలో అవ్వండి

Telangana
Telangana CMO WhatsApp channel :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను ఉపయోగించుకునే పనిలో పడింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) వాట్సాప్ చానెల్ (WhatsApp) ను ప్రారభించింది. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వం సీఎంవో నుంచి వెలువడే ప్రకటనలను ప్రజలకు చేరవేస్తుంది. ఈ ఛానెల్ ద్వారా ప్రభుత్వ ప్రకటనలు, ముఖ్య సమాచారాన్ని సాధారణ ప్రజలకు వేగంగా చేరేలా చేస్తుంది. CMO ఛానెల్‌ ద్వారా ప్రజలు CMO నుండి తాజా అప్ డేట్స్ ను చూడవచ్చు. CMO వాట్సాప్ ఛానెల్‌ని IT డిపార్ట్‌మెంట్ లోని డిజిటల్ మీడియా విభాగం, ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయం (CMPRO) నిర్వహిస్తుంది.  QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ప్రజలు  ఛానెల్‌లో చేరవచ్చు. CMO ఛానెల్‌లో ఇలా  చేరవచ్చు. 1. WhatsApp అప్లికేషన్ తెరవండి. 2. మొబైల్‌ ఫోన్ వాట్సప...
Exit mobile version