Visa Free Travel : భారతీయులు ఇప్పుడు వీసా లేకుండా 58 దేశాలను సందర్శించవచ్చు..
Visa Free Travel : ఈ ఏడాది 2024లో భారతీయ పాస్‌పోర్ట్ 2 పాయింట్లు పెరిగి 82వ స్థానానికి చేరుకుంది. భారతీయ పాస్‌పోర్ట్‌పై 58 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీని పొందవచ్చు. వీటిలో అంగోలా, భూటాన్, మాల్దీవులు సహా అనేక దేశాలు ఉన్నాయి. 2023లో భారతదేశం 84వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఏ దేశం ఏ ర్యాంక్‌ను పొందిందో ఇప్పుడు తెలుసుకోండి..
ఒక దేశ బలం దాని పాస్‌పోర్ట్ తో నిర్ణయించవచ్చు. సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ జాబితాలో భారత్ కూడా తన స్థానాన్ని మెరుగుపరుచుకుది. UK ఆధారిత హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం ఈ జాబితాలో భారతదేశం 82వ స్థానంలో నిలిచింది.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇస్తారు. 2022లో భారత్ 87వ స్థానంలో ఉంది. 2023లో భారత్‌కు 84వ స్థానం లభించింది. ...