Kavach 3.2 for Train Safety | దక్షిణ మధ్య రైల్వేలో రైలు భద్రత కోసం కవాచ్ 3.2 ఇన్ స్టాలేషన్
Kavach 3.2 for Train Safety | రైల్వేల భద్రత కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు 1200 కిలోమీటర్ల మేర స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అయిన కవాచ్ కవచ్ ను ఇన్ స్టాల్ చేస్తోంది. ఇటీవల నాగర్‌సోల్ - ముద్ఖేడ్ - సికింద్రాబాద్ - ధోనే - గుంతకల్, బీదర్ - పర్లీ వైజనాథ్ - పర్భానీ మార్గాల్లో ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈసారి అత్యాధునిక కవాచ్ తాజా వెర్షన్ 3.2 అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది.
లోకో పైలట్ రైలుకు బ్రేక్ వేయడంలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్‌లను ఉపయోగించి ప్రమాదాలను అరికట్టేందుకు రైళ్లలో కవాచ్ సిస్టమ్ లోకో పైలట్‌కు సహాయపడుతుంది. ప్రతికూల వాతావరణంలో రైలును సురక్షితంగా నడపడానికి కూడా ఉపయోగపడుతుంది. కాగా రైల్వే ఉన్నతాధికారులు ఆదివారం సికింద్రాబాద్-ఉందానగర్ సెక్షన్ మధ్య తుంగభ...