Tollywood News | సీఎంతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ.. కీలకాంశాలపై చర్చ
Tollywood News Updates | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా పరిశ్రమ ప్రతినిధులు ఈ రోజు కలిశారు. పలు అంశాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాల మార్గాలు తదితర విషయాలపై సమాలోచన చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ (Shirtej) తీవ్రంగా గాయపడం లాంటి సంఘటన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది.
సినీ పరిశ్రమ నుంచి పాల్గొన్నదెవరంటే..
ముఖ్యమంత్రితో సమావేశమైన సినీ ప్రముఖుల్లో అల్లు అరవింద్ (Allu Aravind), నాగార్జున, వెంకటేశ్, మురళి మోహన్, రాఘవేంద్రరావు, సి.కల్యాణ్, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను ఉన్నారు. ప్రభుత్వం తరఫున డిప్యూట...