గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం… టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవీ..
TTD Trust Board Meeting : యువతీయువకుల్లో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం శ్రీవారి ఆలయం నుంచి తొలి అడుగు వేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇందులోభాగంగా రామకోటి తరహాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు యవతకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి తిరుమల స్వామి వారి బ్రే క్ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. 10 లక్షలా 1,116 సార్లు గోవింద నామాలు రాసినవారికి దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళ వారం ధర్మకర్తల మండలి మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశలో తీసుకున్న కీలక నిర్ణయాలను
ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.
– సనాతన ధర్మం, మానవీయ, నైతిక విలువలపై అవగాహన కల్పించేందుకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా 20పేజీల్లో
భగవద్గీత సారాంశాన్న...