Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: TGSRTC MD Sajjanar

TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..
Telangana

TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..

Hyderabad TGSRTC Cargo | ఇక నుంచి ఇంటి వ‌ద్ద‌కే నేరుగా కార్గో సేవ‌లను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) సిద్ధమైంది. ఆర్టీసీ  ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను  వేగంగా విస్త‌రించేందుకు  చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్ లో  వేగ‌వంత‌మైన కార్గో సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు. రేపటి నుంచే హైద‌రాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని మంత్రి పొన్నం వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్క‌డికైనా హోం డెలివ‌రీ చేయవ‌చ్చ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయా...
Telangana

TGSRTC | ఆర్టీసీ టికెట్ ధ‌ర‌ల పెంపుపై వీసీ స‌జ్జ‌నార్ ఏం చెప్పారంటే..

TGSRTC | బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో ఆర్టీసీ టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ (Sajjanar) స్ప‌ష్టం చేశారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించింది. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్య స్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోంది. ప్ర‌యాణికుల‌ రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు న‌డిపిస్తుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి...
Exit mobile version