Tuesday, March 4Thank you for visiting

Tag: TG News

రైతులకు గుడ్ న్యూస్.. మరో 3 లక్షల మందికి రుణమాఫీ… 30వ తేదీన ఖాతాల్లోకి డబ్బులు

Telangana
Rythu Runa Mafi : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే.. అయితే పలు సాంకేతిక కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో ప్రభుత్వం.. రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించింది. ఇక త్వరలోనే వీరికి రుణమాఫీ స్కీమ్ ను వర్తింపజేయనుంది. రుణమాఫీ కాని రైతుల విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) కీలక ప్రకటన చేశారు. బుధవారం షాద్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పలు కారణాలతో రుణమాఫీ జరగని 3 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని  మంత్రి తుమ్మల పేర్కొన్నారు. నవంబర్ 30న మహబూబ్ నగర్ లో జరగనున్న రైతు పండగ సందర్భంగా డబ్బులు జమ చేయనున్నామని  ప్రకటన చేశారు. కాగా రైతు రుణమాఫీ (Rythu Runa Mafi ) కి రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని.. రాష్ట్రంలోని మిగతా రైతులకు కూడా అందజేస...

Vikarabad | సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకాలో కలెక్టర్‌పై రైతుల ళ్ల దాడి

Telangana
Farmers Attack On Vikarabad Collector | ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇలాకాలో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా  మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామ సభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో కలెక్టర్‌ లగచర్ల గ్రామానికి చర్చల కోసం బయలుదేరారు.కలెక్టర్‌ గ్రామంలోకి  రాగానే ఆయనకు వ్యతిరేకంగా రైతులు ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తించారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ వెనక్కి వెళ్లిపోవాలంటూ కారుపై రాళ్లను విసిరారు. కారు దిగి రైతులతో చర్చించి ఒప్పించేందుకు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ప్రయత్నించారు. ఈ...

మూసీ బాధితుల కోసం రంగంలోకి  బిజెపి.. నేటి నుంచి యాక్షన్ ప్లాన్..

Telangana
Hyderabad | హైడ్రా (Hydra), మూసీ కూల్చివేతల విషయంలో బాధితులకు అండగా నిలిచేందుకు  బీజేపీ రంగంలోకి దిగింది.  దీనిపై ఈరోజు కార్యాచరణ ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మూసీ (Musi) సుందరీకరణలో భాగంగా  బాధితులైనవారి తరఫున  తమ పోరాటం ఉంటుందని తెలిపారు. బుధవారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో బుధవారం కిషన్‌ ‌రెడ్డి పర్యటించారు. అంబర్‌పేట్‌, అసెంబ్లీ, ముసారాంబాగ్‌, అం‌బేడ్కర్‌ ‌నగర్‌, ‌తులసి నగర్ ‌మీదుగా కృష్ణానగర్‌ లో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఎదుట తమ కష్టాలను వివరించారు. ఇళ్లు కోల్పోతే రోడ్డున పడతామని కన్నీళ్ల పర్యంతమ‌య్యారు. మీరే దిక్కంటూ బోరున విలపించారు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమను ఇక్కడ్నుంచి పంపించవద్దంటూ  కోరారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇళ్లు కట్టుకున్నామని,...

TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

Telangana
New Electric Buses | రాష్ట్రంలో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, కాలుష్య భూతాన్ని క‌ట్ట‌డి చేసే దిశ‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముందుకు సాగుతోంది. తాజాగా 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కించాల‌ని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం, RTC కింద ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్‌లో నడుస్తున్నాయి. 1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లోనే నడిపే అవకాశం ఉంది. ఇతర ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అత్య‌ధిక ట్రాఫిక్ రూట్లలో న‌డవ‌నున్నాయి. హెచ్‌సియు, హయత్‌నగర్‌తో సహా డిపోలలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను డిమాండ్ ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు. మరోవైపు ఎంజీబీఎస్‌...

CM Revanth Reddy | సర్కారు బడులపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం..

Telangana
CM Revanth Reddy  | తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు తక్కువగా ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయొద్దని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామం, తండాలకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పటిష్టమైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. శిథిలమైన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామ‌న్నారు. విద్యార్థులు రావడం లేదనే సాకుతో సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేద‌ని, మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే అలాంటి దుస్థితి వ‌చ్చింద‌ని తెలిపారు. ప‌దో త‌ర‌గ‌తిలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు వందేమాత‌రం ఫౌండేష‌న్ (vandemataram foundation) ఆధ్వ‌ర్యంలో  రవీంద్రభారతిలో సోమ‌వారం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ...
Exit mobile version