Mega DSC 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యేది ఈ తేదీలోనే !
Mega DSC 2024 : మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీని ప్రకటించే చాన్స్ ఉంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ .జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇటీవల జరిగిన ‘టెట్’ పరీక్షల ఫలితాలు నవంబరు 2న విడుదల చేయనున్నారు.
విభాగాల వారీగా చూస్తూ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) పోస్టులు 6,371
స్కూల్ అసిస్టెంట్లు (SA) పోస్టులు 7,725
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులు 1781
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) పోస్టులు 286
వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (PET) 132
ప్రిన్సి...