Tuesday, April 22Welcome to Vandebhaarath

Tag: Terror Attack

Pahalgam terror attack :  పహల్గాం ఉగ్రదాడి.. 27 మంది పర్యాటకులు మృతి
National

Pahalgam terror attack : పహల్గాం ఉగ్రదాడి.. 27 మంది పర్యాటకులు మృతి

Pahalgam terror attack : జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చిన టూరిస్టులపై అత్యంత పాశవికగా దాడి చేశారు. ఈ ఘటనలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదే. బైసారన్ మైదానంలో ఈ దాడి జరిగింది. ఇది కాలినడకన లేదా గుర్రాల మీద మాత్రమే చేరుకోగల సుందరమైన ప్రదేశం. ఆ సమయంలో పర్యాటకుల బృందం సందర్శిస్తోంది. సంవత్సరాల తరబడి ఉగ్రవాదం నుంచి కోలుకుంటున్న కాశ్మీర్‌లో పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉగ్ర దాడి సంఘటన జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు పర్యాటకులపై దాదాపు 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. ముష్కరులకు ప్రధాని మోద...
Exit mobile version