TTD | టీటీడీలో అన్యమత ఉద్యోగులకు షాక్..
TTD Employees Transferred : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అన్యమత ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీలో హిందూవేతర ఉద్యోగులపై పాలక మండలి బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా 18 మంది ఉద్యోగులను అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. కాగా టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ బదిలీ చేయాలని చాలా రోజులుగా భక్తుల నుంచి డిమాండ్ వస్తోంది .
కాగా బదిలీ అయిన వారి (TTD Employees Transferred ) లో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, హాస్టల్ వార్డెన్, తదితరులు ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది అన్యమత ఉద్యోగులను కూడా ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు డైరెక్ట్ క్యూలైన్‌లో వెళ్తున్నారు. స్వామ...