ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్
ఉత్తరప్రదేవ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని తన ఇంట్లో 16 ఏళ్ల బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతూ తన అన్నయ్య డ్రగ్స్ తీసుకోవాడం మానేయాలని కోరుతూ సుసైడ్ నోట్ రాసింది.
ఈ హృదయవిదారక ఘటన ఘజియాబాద్ లో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఇందిరాపురం స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు.
కాగా తన సూసైడ్ నోట్‌లో బాలిక తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అయితే "నా సోదరుడు డ్రగ్స్ మానేయడానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని రాసి ఉంది.
బాధితురాలి అన్నయ్య పోక్సో చట్టం కింద జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు.
గురువారం ఆమె తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె తలుపు తట్టిందని, గది లోపల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థల...