Transfers In Telangana | రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం
మరో 74 మంది మున్సిపల్ కమిషనర్‌లు బదిలీ
Transfers In Telangana | హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు మున్సిపల్ కమిషనర్ల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం 40 మందిని బదిలీ (Transfers In Telangana) చేస్తూ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే బుధవారం మరో 74 మందికి ప్రభుత్వం స్థాన చలనం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర పురుపాలక శాఖ.. ఈ బదిలీలను చేపట్టింది. అయితే ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో కూడా భారీగా బదిలీలు చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖలో మొత్తం 105 మంది అధికారులను బదిలీ చేశారు. సోమవారం జారీ చేసిన ఉత్తర్వులతో సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేశారు.
14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లును తెలంగాణ ఆబ్కారీశాఖలో బదిలీ చేశారు. ఇద్దరు ఉప కమిషనర్ల తో పాటు 9 మంది సహాయ కమిషనర్లకు ప్రభుత్వం బదిలీ ఉ...