2025 Holiday List | 2025 సెలవుల జాబితా విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
2025 Holiday List : రాష్ట్రంలోని విద్యార్థులు, ఉద్యోగులు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మరికొద్దిరోజుల్లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో.. 2025 సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్, ఆప్షనల్ హాలిడేస్ వివరాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025 ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు వొస్తుండగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
జనవరి ఒకటో తేదీతోనే సెలవుల జాబితాను మొదలుపెట్టిన ప్రభుత్వం.. జనవరి 14న సంక్రాంతి పండుగకు.. మార్చి 30న ఉగాది పండుగకు, ఆగస్టు 27న వినాయక చవితి, అక్టోబర్ 3న విజయదశమి(Dasara).. అక్టోబర్ 20న దీపావళి లాంటి ముఖ్యమైన పండుగలన్నింటికి ఎప్పటిలాగే ప్రభుత్వ సెలవులను ప్రకటించింంది. అయితే.. జనవరి ఒకటవ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండవ శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెల్లడించి...