Telangana Budget 2025 – 26 | ₹3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ .. శాఖల వారీగా కేటాయిపులు ఇవే..
Hyderabad : ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ₹ 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ (Telangana Budget 2025 - 26) ను ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి మొత్తం ₹ 3,04,965 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు, ఇందులో ₹ 2,26,982 కోట్లు రెవెన్యూ వ్యయం కోసం, ₹ 36,504 కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయించారు."తెలంగాణను 10 సంవత్సరాలలో 1,000 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు" అని అన్నారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కింద పింఛన్ల పంపిణీ వంటి అనేక పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు.
Telangana Budget 2025 ...