Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: technology

Geyser Buying Guide : మీ ఇంటికి గీజర్ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి..!
Life Style

Geyser Buying Guide : మీ ఇంటికి గీజర్ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి..!

Geyser Buying Guide | మీ ఇంటికి  బెస్ట్ గీజర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?  మార్కెట్‌లో చాలా ఎన్నో కంపెనీలకు చెందిన వివిధ రకాల గీజర్లు  అందుబాటులో ఉన్నాయి. చలికాలంలో వెచ్చని నీటితో స్నానం చేసేందుకు వేగంగా, సురక్షితంగా ఉండే ఉత్తమమైన వాటర్ హీటర్‌ను ఎంచుకోవాలి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో అనేక గీజర్లు  అందుబాటులో ఉన్నందున వాటిలో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. గీజర్లపై ఒక అవగాహన కోసం ఈ ముఖ్య విషయాలను తెలుసకోండి.. ఇన్‌స్టంట్ గీజర్ వర్సెస్ స్టోరేజ్ గీజర్  ఇన్‌స్టంట్ గీజర్లు (Instant geysers )  కాంపాక్ట్  ఉండి నీటిని వేగంగా వేడి చేస్తాయి. ఈ గీజర్‌లను చిన్న కుటుంబాలు లేదా ఒంటరిగా ఉండేవారికి అనువుగా ఉంటాయి. అంటే రోజువారీగా తక్కువ వేడి నీరు అవసరం అయ్యేవారికి ఇన్‌స్టంట్ గీజర్లు  సరిపోతాయి. స్టోరేజ్ గీజర్లు (Storage geysers) పెద్ద ట్యాంక్ సామర్థ్యంతో వస్తాయి. ఈ గీజర్‌...
Technology

Flexible Display | LG అద్భుత సృష్టి.. టవల్ లా మెలితిరిగే డిస్ల్పే ..

Flexible Display | ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ దిగ్గజం LG  ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే టెక్నాలజీని రూపొందించింది. ఈ డిస్ప్లేను  మీరు టవల్ లాగా మెలిపెట్టవచ్చు. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఈ సాంకేతికత తొలి సంస్కరణలను ఇప్పటికే ప్రదర్శించింది. ఇది స్క్రీన్‌ను వెడల్పుగా అలాగే పొడవుగా సాగదీయవచ్చు. ఇప్పటికీ ప్రోటోటైప్ దశలోనే ఉన్నప్పటికీ, ఈ ఆవిష్కరణ ఖచ్చితంగా ఫోల్డబుల్ డిస్‌ప్లే మార్కెట్‌లో అగ్రగామి నిలవనుంది. LG ప్రకారం, డిస్ప్లే దాని అసలు పరిమాణంలో 50 శాతం వరకు ఇమేజ్ నాణ్యతను రాజీ పడకుండా విస్తరించగలదు. తాజా ప్రోటోటైప్ 12-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది అంగుళానికి 100 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కొనసాగిస్తూ 18 అంగుళాల వరకు విస్తరించగలదు. LG గతంలో 2022లో స్ట్రెచబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ కి సంబంధించి విభిన్న నమూనాను ఆవిష్కరించింది. ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే విలక్షణమైనది ఎల్జ...
Entertainment, Technology

Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ లో అదిరిపోయే అప్‌డేట్‌.. కొత్తగా ‘మూమెంట్స్ ఫీచ‌ర్ తో ఏం చేయొచ్చంటే..

Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ తన మొబైల్ యాప్‌లో కొత్త 'Moments' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, వినియోగదారులు మూవీస్ లేదా షోస్‌ నుంచి మీకు న‌చ్చిన సీన్స్ ను బుక్‌మార్క్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వీటిని మీరు ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకోవచ్చు. ప్రస్తుతం iOS యాప్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రాబోయే కొద్ది వారాల్లో ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి రానుంది. Netflix Moments : ముఖ్య వివరాలు సినిమాలు, లేదా వెబ్ సిరీస్ నుంచి దృశ్యాన్ని సేవ్ చేయడానికి, వినియోగదారులు స్క్రీన్ దిగువన ఎడమవైపు ఉన్న కొత్త “Moments” బటన్‌ను నొక్కవచ్చు. ఇది నా నెట్‌ఫ్లిక్స్ ట్యాబ్‌లో దృశ్యాన్ని సేవ్ చేస్తుంది, మళ్లీ దీనిని మీకు వీలు ఉన్న‌ప్పుడు సుల‌భంగా వీక్షించుకోవ‌చ్చు.వినియోగదారులు సినిమా లేదా ఎపిసోడ్‌ని మళ్లీ చూడాలని అనుకుంటే బుక్‌మార్క్ చేసిన సీన్ ను ప్లేబ్యాక్ చేయ‌వ‌చ్చు. సోషల్ ...
Technology

Acer Iconia Tablets | డ్యూయ‌ల్ 4G సిమ్ తో ఏస‌ర్ నుంచి అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో కొత్త‌ టాబ్లెట్స్‌.. త‌క్కువ ధ‌ర‌లోనే..

Acer Iconia Tablets | తైవానీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Acer భారతదేశంలో 8.7-అంగుళాల Iconia Tab iM9-12M, 10.36-అంగుళాల Iconia Tab iM10-22 ఫీచర్లతో Iconia Tab Android టాబ్లెట్‌లను విడుద‌ల చేసింది. వీడియో ప్లేబ్యాక్ కోసం గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంద‌ని Acer పేర్కొంది. అదనంగా, రెండు మోడళ్లలో కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ 4G LTE సపోర్ట్ ఇస్తుంది. Acer Iconia Tab iM: ధర, లభ్యత Acer Iconia Tab iM9-12M (8.7-అంగుళాల): రూ 11,990 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. అలాగే Acer Iconia Tab iM10-22 (10.36-అంగుళాల): రూ 14,990 నుంచి మొద‌లవుతుంది. Acer Iconia Tabs కొత్త సిరీస్‌ ఇప్పుడు భారతదేశంలో Acer ప్రత్యేక స్టోర్స్‌, Acer ఆన్‌లైన్ స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. Acer Iconia Tab iM: స్పెసిఫికేష‌న్స్‌ 8.7-అంగుళాల Acer Iconia Tab iM9-12M MediaTek Hel...
Trending News

రూ.130 కోట్ల‌తో అభివృద్ధి చేసిన‌ పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?

Param Rudra Supercomputers | వాతావరణ మార్పుల‌పై పరిశోధనల కోసం మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సిస్టమ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సూపర్ కంప్యూటర్‌లను భారతదేశంలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద అభివృద్ధి చేశారు. ఈ మూడు పరమ రుద్ర సూపర్‌కంప్యూటింగ్ సిస్టమ్‌ల త‌యారీకి సుమారుగా రూ. 130 కోట్లు ఖ‌ర్చు చేశారు.అధిక-పనితీరు గల సైంటిఫిక్ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌కు స‌హ‌క‌రించేందుకు పూణె, ఢిల్లీ, కోల్‌కతాలో వీటిని మోహ‌రిస్తారు. వర్చువల్ ఈవెంట్ లో ఈ సూప‌ర్ కంప్యూట‌ర్‌ల‌ను మోదీ ప్రారంభించారు. తన ప్రసంగంలో దేశంలో కంప్యూటింగ్ సామర్థ్యం ప్రాముఖ్యతను ప్రధాని వెల్ల‌డించారు. “పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హెచ్‌పిసి సిస్టమ్‌తో, భారతదేశం కంప్యూటింగ్‌లో స్వావలంబన దిశగా అడుగులు వేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆవిష్కరణలను ముందుకు నడిపిస్తోంద...
Technology

Flipkart Big Billion Days sale | ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ : ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్?

Flipkart Big Billion Days sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభమ‌వుతోంది. ఇందులో ప్ర‌త్యేకంగా ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేయనున్నారు. ఐఫోన్‌ 15 సిరీస్‌పై గ్రేట్‌ డీల్స్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు అవ‌కాశం కల్పిస్తున్నారు. ఆపిల్‌ ఐఫోన్‌ 15 ధర ప్రస్తుతం రూ. 69,900 ఉంది. ఈ ధరను ఈ-కామర్స్‌ దిగ్గజం బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భారీగా త‌గ్గించ‌నుంది. ఈ సేల్‌లో ఐఫోన్‌ 15 సిరీస్‌, ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, 15 ప్రొ, 15 ప్రొ మ్యాక్స్‌ సహా అన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ ఆఫ‌ర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లపై ఎంత వ‌ర‌కు డిస్కౌంట్లు ఉంటాయనే వివరాలను వెబ్‌సైట్‌ ఇప్పటివరకూ వెల్ల‌డించ‌లేదు. డిస్కౌంట్ల గురించి ఈ-కామర్స్‌ దిగ్గజం సెప్టెంబర్‌ 23న ప్ర‌క‌టించ‌నుంది. గత ఏడాది విడుదలైన ఐఫోన్ 15 సిరీస్‌ ఈ సేల్‌ల...
Technology

BSNL Live TV App | బిఎస్ఎన్ఎల్ దూకుడు.. Jio, Airtel కు పోటీగా BSNL లైవ్ టీవీ యాప్ వచ్చింది..

BSNL Live TV App : ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టీవీ ప్రపంచంలోకి ప్రవేశించింది. BSNL తాజాగా 'BSNL లైవ్ టీవీ' అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ప్రారంభంలో Android TVలకు అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, దీని పూర్తి ఫీచ‌ర్ల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. BSNL లైవ్ టీవీ యాప్ ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ల్యాండ్‌లైన్ టెలిఫోన్ సేవలను ఒకే CPE (కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్‌మెంట్)గా అందిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ ఆధారిత సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. మీడియా నివేదిక ప్రకారం, కొత్త యాప్‌ను WeConnect అభివృద్ధి చేసింది BSNL కస్టమర్‌లకు సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, BSNL ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సేవను ప్రవేశపెట్టింది. ప్రస్...
Technology

మీరు BSNL కి మారుతున్నారా? త‌క్కువ ధ‌ర‌కే 45 రోజుల రీఛార్జ్ ప్లాన్‌..

BSNL Rs 249 recharge plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  ప్ర‌స్తుతం దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవ‌ల కాలంలో తీసుకువ‌స్తున్న చ‌వకైన‌ ప్లాన్‌లతో Jio, Airtel, Vi వంటి పోటీదారులకు గ‌ట్టి షాక్ ఇస్తోంది. మిగ‌తా ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు ఇప్పటికే ఉన్న రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచగా, BSNL మాత్రం త‌క్కువ ధ‌ర క‌లిగి ఎక్కువ వాలిడిటీని క‌లిగిన రీచార్జ్ ప్లాన్ల‌ను అందిస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తోంది. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్.. కొత్తగా 45-రోజుల వ్యాలిడిటీ గ‌ల‌ ప్లాన్‌ను ప్రారంభించింది, ఇది దేశంలోని చాలా మంది వినియోగదారులకు ఉపశమనం అందిస్తుంది,. మిగ‌తా కంపెనీల కంటే పోటీదారుల కంటే ఎక్కువ విలువ‌ను అందిస్తోంది. ఈ కొత్త రీచార్జి వివ‌రాలు.. Jio, Airtel మరియు Vi అధిక ధరలతో 28 లేదా 30-రోజుల చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో BSNL సరసమైన 45-రోజుల చెల్లుబా...
National

BSNL Recharge Plans | బిఎస్ఎన్ఎల్ లో ఈ రీచార్జ్ ల‌తో మీ నెల‌వారీ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోండి..

BSNL Recharge Plans | జియో, ఎయిర్‌టెల్, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవలి టారిఫ్ పెంపు తర్వాత దేశవ్యాప్తంగా BSNL ప్రజాదరణ పొందుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ టెలికాం ప్రొవైడర్ దేశంలోనే అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇదే ఇప్పుడు చాలా మంది స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను ఆకర్షిస్తున్న‌ది.. అంతేకాకుండా BSNL తన 4G సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్త‌రిస్తోంది. మీరు BSNLని ఉపయోగిస్తుంటే లేదా బిఎస్ ఎన్ ఎల్ కు మారాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు ఏది త‌క్కువ ఖ‌ర్చుతో నెల‌వారీ రీచార్జ్ ప్లాన్‌ల‌ను ఇక్క‌డ తెలుసుకోండి. BSNL రూ. 107 మరియు రూ. 153 ధరలతో రెండు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రెండింటి మధ్య కేవలం రూ. 46 ధర వ్యత్యాసం ఉంటుంది. అయినప్పటికీ, అవి వాటి ప్రయోజనాలలో చాలా భిన్నంగా ఉంటాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించిన వివరాలు ఇవీ.. BSNL రూ. 107 రీఛార్జ్ ప్లాన్ BSNL ర...
Technology

BSNL 4G: ఇప్పుడు 15,000 మొబైల్ టవర్లలో 4G స‌ర్వీస్‌

BSNL 4G : ప్రభుత్వ రంగ టెలికామ్‌ సంస్థ‌ బిఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు తన 4G సేవను ప్రారంభించింది. ఈ కంపెనీ చ‌రిత్ర‌లో ఇది ముఖ్యమైన మైలురాయి అని చెప్ప‌వ‌చ్చు. దేశవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. BSNL దేశవ్యాప్తంగా 4G సేవలను అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేందుకు 5G టెక్నాలజీని పరీక్షించడం కూడా ప్రారంభించింది. అదనంగా, BSNL ఇప్పుడు వినియోగదారులకు 5G స‌పోర్ట్ చేసే SIM కార్డ్‌లను అందిస్తోంది. BSNL 15 వేలకు పైగా 4G సైట్‌లను ఇప్పుడు ప్రారంభించింది. ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్ క్రింద స్థాపించబడిన ఈ సైట్‌లు భారతదేశం అంతటా ఫాస్టెస్ట్‌ కనెక్టివిటీని అందిస్తాయని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా, బిఎస్ఎన్ఎల్ 4G సేవ పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో భారతదేశంలో తయారు చేయబడిన పరికరాలు అమర్చారు. బిఎస్ఎన్ఎల్ 4G రోల్ అవుట్ టైమ్‌లైన్...
Exit mobile version