TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు
Hyderabad | తెలంగాణలో ప్రజల డిమాండ్ కు తగినట్లుగా కొత్త బస్సుల కొనుగోలు (TGSRTC New Buses) కు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. పెరిగిన రవాణా అవసరాలు, నూతన మార్గాలను ప్రతిపాదికగా బస్సుల కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో టీజీ ఆర్టీసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్షించారు. మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతోందని.. ఇప్పటివరకు 83.42 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. దీనిని బట్టి మహిళా ప్రయాణికులకు రూ.2,840.71 కోట్లు ఆదా అయిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు.
టిజి ఆర్టీసీలో 7,29...