PM Modi : అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi..Biggest Meditarion center in Varanasi : ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరం అందుబాటులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్వవేద్ మహామందిర్ లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. 7 అంతస్తుల్లో నిర్మించిన ఈ మందిరంలో 20,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునేందుకు వీలుంటుంది.
ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM modi ) మాట్లాడుతూ.. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించినప్పుడు తాను ఎంతో మంత్రముగ్ధుడినయ్యానని.. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతం, రామాయణం వంటి దైవిక బోధనలు మహామందిర్ గోడలపై చిత్రాలుగా ఏర్పాటు చేయటం చూసి చాలా ఆనందంగా ఉందని అన్నారు. సాధువుల మార్గదర్శకంలో కాశీ ప్రజలు అభివృద్ధి.. నవ నిర్మాణ పరంగా కొత్త రికార్డులు సృష్టించారని అన్నారు. సర్వవేద్ మహామందిర్ దీనికి ఉదాహరణ అని కొనియాడారు. కాశీలో గడిపిన ప్రతీ క్షణం అద్భుతంగా ఉంటుందని ప్రధాని మోదీ ...