UTS Cashback Offer | ప్రయాణికులకు గుడ్‌న్యూస్ | UTS మొబైల్ యాప్ తో అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్
UTS Cashback Offer | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల అభిప్రాయం ప్రకారం, UTS యాప్ ఆధునిక టికెటింగ్ వ్యవస్థలో ఒక పెద్ద ముందడుగు. భారతీయ రైల్వేస్‌లో అన్ రిజర్వ్ టిక్కెట్లపై ప్రయాణించేవారికి ఇది ఒక వరంగా చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా చొరవకు అనుగుణంగా, ఈ యాప్ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. ప్రయాణీకులు R-Wallet, Paytm, PhonePe, Googlepay, UPI యాప్‌లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ డిజిటల్ ప్లాప్‌ఫాంల ద్వారా చెల్లింపు చేయవచ్చు. R-Wallet UTS యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిలో మొత్తాలను రూ. 20,000 పరిమితి వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రచార సూచనగా, R-Wallet ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై 3 శాతం క...