Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: South Central Railway

Amrit bharat station scheme : రూ.25.41 కోట్లతో కొనసాగుతున్న  ఖమ్మం  రైల్వే స్టేషన్ అభివృద్ధిపనులు
National

Amrit bharat station scheme : రూ.25.41 కోట్లతో కొనసాగుతున్న ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధిపనులు

Amrit bharat station scheme : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపే మార్గంలో కీలకమైన ఖమ్మం రైల్వే స్టేషన్ (Khammam railway station ) రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. రైలు ప్రయాణికులకు మెరుగైన అత్యాధునిక సౌకర్యాలు అందించడానికి భారతీయ రైల్వే భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులు చేపడుతున్న విషయం తెలిసిందే.. అమృత్ భారత్ స్టేషన్ స్కీం (ABSS) లో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్‌లను రూ.2,737 కోట్ల అంచనా వ్యయంతో, ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను కల్పిస్తూ పునరాభివృద్ది చేపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 2023, ఫిబ్రవరి 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి ప్రమాణాలు, హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగంపేట, నాంపల్లి, మల్కాజిగిరి, కాజీ...
Andhrapradesh, Telangana

Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..

Holi special trains : హోలీ పండుగ సంద‌ర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్ట‌మైన‌ వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చ‌ర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌, షాలిమార్, సంత్రాగచి, జల్నా, పాట్నా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి. ఈ స్టేష‌న్ల‌లో హాల్టింగ్ ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరంలో ప్ర‌త్యేక రైళ్ల‌కు హాల్టింగ్ సౌక‌ర్యం ఉటుంది. అలాగే ఒడిశా భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్‌తో సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతారు. జ...
National

Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప‌నులు

కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ పున‌రాభివృద్ధి ప‌నులు (Warangal Railway Station) శ‌ర‌వేగంగా కొస‌సాగుతున్నాయి. వ‌రంగ‌ల్ రైల్వేస్టేష‌న్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.25.41 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే (Indina Railways) స్టేష‌న్ ముఖ ద్వారం సుంద‌రీక‌రించ‌డంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్నారు.ఇప్పటికే ఓరుగల్లు రైల్వేస్టేషన్ ముందు భాగాన్ని కాకతీయుల కళావైభవం, వారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చదిద్దారు.. సాయంత్రం వేళ విభిన్న రకాల రంగురంగు లైట్లతో స్టేషన్ వెలిగిపోతూ ప్రయాణికులను, బాటసారులను ఆకర్షిస్తోంది. ఇక రైల్వే స్టేషన్ లోపల ప్రయాణీకులు సులభంగా రాకపోకలు సాగించేందుకు, రద్దీని తగ్గించడానికి 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మిస్తున్నారు. అధునాతన రెస్ట్ రూమ్ లు ర...
Telangana

Railway Development Works : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ పై క‌ద‌లిక‌

Kothapalli Manoharabad Railway Line : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి (Railway Development Works)పై సంబంధిత అధికారులతో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ (Bandi Sanjay kumar )సమీక్ష నిర్వ‌హించారు. అందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద సరికొత్త రూపం సంతరించుకుంటున్న కరీంనగర్ రైల్వే స్టేషన్, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, ఉప్పల్ ఆర్వోబీ, కొత్తపల్లి స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ సంద‌ర్భంగా తీగలగుట్టపల్లి వద్ద రూ.36లక్షలతో చేపట్టనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ భూమిపూజ చేశారు. ఇక ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కేంద్ర‌మంత్ర...
Andhrapradesh

Sankranti Festival : సంక్రాంతి ప్ర‌యాణికుల‌తో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిట‌కిట.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల దోపిడీ

Hyderabad : సంక్రాంతి వేడుక‌లు (Sankranti Festival) స‌మీపిస్తుండ‌డంతో పండుగ‌ల వేడుక‌లు ఉత్సాహంగా జ‌రుపునేందుకు హైద‌రాబాద్ జ‌న‌మంతా త‌మ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప‌య‌న‌మ‌వుతున్నారు. విద్యాల‌యాల‌కు సెలవులు ప్ర‌క‌టించ‌డంతో పిల్ల‌ల‌తో క‌లిసి కుటుంబ‌స‌మేతంగా హైద‌రాబాద్‌, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో అన్ని బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, సాధార‌ణ ప్ర‌జ‌లు ప్లాట్‌ఫారమ్‌లపై బ‌స్సులు, రైళ్ల కోసం వేచిచూస్తున్నారు. కాగా జంటనగరాల్లో అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పండుగ రద్దీ నెలకొంది. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సంక్రాంతి ప్ర‌యాణికుల‌ రద్దీకి అనుగుణంగా 100 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.. ఎందుకంటే వేలాది మంది ప్రయాణికులు వారి లగేజీతో పాటు సికింద్రాబాద్ స్టేషన్‌న...
Telangana, తాజా వార్తలు

Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Charlapalli Railway Station : సుమారు రూ. 413 కోట్లతో అత్యాధునిక హంగులు, స‌క‌ల సౌకర్యాల‌తో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ఎట్ట‌కేల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ రైల్వే టెర్మిన‌ల్‌లో మొత్తం 19 ట్రాక్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వేస్టేష‌న్ల త‌ర్వాత చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ కీలకమైన టెర్మిన‌ల్ గా మారింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చ‌ర్లపల్లి నుంచే నడిపించ‌నున్నారు. దీనివ‌ల్ల సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచీగూడ‌ స్టేషన్ల‌లో రద్దీ తగ్గుతుంది. చ‌ర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, MGR చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా...
Trending News

SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

SCR Special Trains | పెరుగుతున్న ప్ర‌యాణిక‌ల ర‌ద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - విల్లుపురం (Secunderabad to Villupuram) మధ్య ప్రత్యేక రైళ్ల‌ను ప్రవేశపెట్టింది. రైలు నెం. 07601 డిసెంబర్ 12, 2024, గురువారం రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. రైలు నెం. 07602 డిసెంబర్ 13, 2024 శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విల్లుపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు సర్వీసులు వన్-టైమ్ స్పెషల్‌లుగా షెడ్యూల్ చేసింది. కోచ్ కంపోజిషన్ రైళ్లలో రెండు AC టూ-టైర్ కోచ్‌లు, ఏడు AC త్రీ-టైర్ కోచ్‌లు, పదకొండు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు లగేజ్-కమ్-బ్రేక్ వ్యాన్‌ కోచ్ ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రయాణికులు ఈ ప్...
Trending News

Charlapalli railway station | ఎయిర్ పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్.. ఈ రైళ్లు ఇక్కడి నుంచే..

Charlapalli railway station | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌  కొత్త శాటిలైట్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) శనివారం దీనిని ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా చర్లపల్లిరైల్వేష్టేషన్ అవతరించబోతోంది. ఈ కొత్త టెర్మినల్‌ ప్రారంభమయ్యాక హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ. 428 కోట్లతో ఈ స్టేషన్‌ను హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. ఐదు లిఫ్టులు, ఐదు ఎస్కులేటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం, అత్యంత ఆకర్షణీయంగా ముఖ్య ద్వారం నిర్మించారు. ఈ స్టేషన్‌ ‌భవనంలో గ్రౌండ్‌ ‌ఫ్లోర్ లో ఆరు టికెట్‌ ‌బుకింగ్‌ ‌కౌంటర్లు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ...
Trending News

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Sabarimala Special Trains: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం శబరిమలకు అయ్య‌ప్ప భ‌క్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి వరకూ భ‌క్తుల ర‌ద్దీ కొనసాగుతుంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో రైళ్లు కిట‌కిట‌లాడుతుంటాయి. టికెట్ రిజర్వేషన్ కూడా ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఈ నేప‌థ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ స్పెషల్ ట్రైన్స్‌.. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి అందుబాటులో ఓసారి ప‌రిశీలించండి.. శబరిమల అయ్యప్ప భక్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.ఈ 26 రైళ్లు తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేరళ మధ్య రాక‌పోక‌లు సాగించ‌నున్నాయి. ఈ రైళ్లు నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29వ‌ తేదీల్లోనూ తిరిగి డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, జనవరి 1వ‌ తేదీల్లో నడవనున్నాయి. శబరిమలకు ప్రత్యేక రైళ...
National

Special trains | గుడ్ న్యూస్‌.. ఈ రూట్ల‌లో ప్ర‌యాణికుల కోసం ప్రత్యేక రైళ్లు

Special trains | ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా భార‌తీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించాల‌ని నిర్ణయించింది. ఈమేర‌కు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ వివ‌రాలు వెల్ల‌డించారు. నాలుగు ప్ర‌త్యేక‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అవి సనత్‌నగర్-సంత్రగచ్చి-సనత్‌నగర్ (07069/07070), ఎస్ఎంవీ బెంగళూరు - సంత్రాగచ్చి - ఎస్ఎంవీ బెంగళూరు (06211/06212) నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 1 సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07069) రైలు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు న‌డుస్తుంది. ఈ రైలు స‌న‌త్ న‌గ‌ర్ లో బుధవారాల‌లో ఉదయం 6:20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 8:55 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 8:57 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం రాత్రి 10:03 గంటలకు, అక్కడ నుండి రాత్రి 10:08 గంటలకు బయలుదేరుతుంది. ...
Exit mobile version