పెరట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. పాములు దగ్గరికి కూడా రావు..!
మీ ఇంటి పరిసరాల్లో తరచూ పాములు సంచరిస్తున్నాయా? సర్పాల నుండి మీ ఇంటిని సురక్షితంగా ఉంచే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.. వీటి సాయంతో పాములను మీ ఇంటి నుండి దూరంగా ఉంచుకోవచ్చు!
పాములు తడిగా ఉండే, దట్టమైన పొదలు, రాళ్ల కుప్పలతో ఉన్న ఏకాంత ప్రదేశాలను ఇష్టపడతాయి. మీకు తెలియకుండానే ఇంటి పరిసరాల్లో సులభంగా నివాసాలను ఏర్పరచుకోవచ్చు. పాములను ఇంటి పరిసరాలకు రాకుండా ఉంచేందుకు సులభమైన మార్గాలలో Natural Snake Repellent Plants పెంచడం ఒకటి. అంటే మీ ఇంటి చుట్టూ పాములు ఇష్టపడని పాము-వికర్షక మొక్కలను పెంచాలి. పాములు ఇష్టపడని ఘాటైన వాసనతో కూడిన మొక్కలు ఈ జాబితాలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం..
Natural Snake Repellent Plants (పాము వికర్షక మొక్కలు)
1. వెస్ట్ ఇండియన్ లెమన్‌గ్రాస్ (West Indian Lemongrass)
బొటానికల్ నేమ్: సైంబోపోగాన్ సిట్రాటస్..
ఈ మొక్క సిట్రస్ మొక్కల సమూహానికి చెందినది మరియు బలమైన ...